Share News

గ్రామీణ ప్రాంతాల్లో సోలార్‌ ప్లాంట్లతో ప్రయోజనాలు

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:46 PM

గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ఇతర వ్యక్తులు సోలార్‌ ప్లాంట్‌ను వినియోగించడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ట్రాన్స్‌కో సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో సోలార్‌ ప్లాంట్లతో ప్రయోజనాలు
సమావేశంలో మాట్లాడుతున్న ట్రాన్స్‌కో సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

చిగురుమామిడి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ఇతర వ్యక్తులు సోలార్‌ ప్లాంట్‌ను వినియోగించడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ట్రాన్స్‌కో సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆన్నారు. శనివారం మండలంలోని రేకొండలో ఏర్పాటు చేసిన మోడల్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఆయన పరిశీలించినారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేకొండలో 52 కోట్లతో ఏర్పాటు చేయనున్న మోడల్‌ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా గ్రామానికి మంచి పేరు వస్తుందని, ఆదాయం వస్తుందని తెలిపారు. రైతులు వ్యవసాయ బావుల వద్ద సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసుకుని వాటి కింద వ్యవసాయ పనిముట్లు భద్రపరుచుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు గ్రామంలో 243 సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అల్లెపు సంపత్‌, డీఈలు తిరుపతి, ఉపేందర్‌, ఏడీఏ నరేందర్‌, రెడ్కో డిస్ట్రిక్‌ మేనేజర్‌ మనోహర్‌, ట్రాన్స్‌కో, రెడ్కో ఏఈలు ప్రకాశ్‌, అన్వేష్‌, లక్ష్మి, కాంతారావు, మునీందర్‌, పంచాయతీ కార్యదర్శి అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 11:46 PM