బాధితులకు సత్వర న్యాయం జరిగే లా చూడాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు.
నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
జిల్లాలో ఖరీఫ్ వరి పంట దాదాపు పూర్తి కావొచ్చింది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సైతం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రబీ సీజన్లో సన్న ధాన్యం బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో ఈసారి ధాన్యం కొనుగోళ్లపై బోనస్ బకాయిల ప్రభావం పడే అవకాశం ఉంది.
వ్యవసాయ రంగంలో వెనుక బడిన రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా అమలుచేస్తున్న ధన్ ధాన్య కృషి యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్ సూచించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నికను పారదర్శకంగా నిర్వహిస్తామని ఎన్నికల పరిశీలకుడు, ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్కుమార్ అన్నారు.
రెబ్బెన మండలం గోలేటి పట్టణంలో రాష్ట్రస్థాయి సెపక్ తక్రా అండర్-14, అండర్-19 బాలబాలికల పోటీలను సింగరేణి జీఎం ఎం విజయభాస్కర్‌రెడ్డి ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామపంచాయతీకి ఈ ఏడాది కూడా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా... గ్రామ సర్పంచ్ పదవిని మాత్రం షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్ చేస్తూ వస్తున్నారు.
పార్టీ కోసం పనిచేసిన వారికే పెద్దపీట వేస్తామని, స్థానికసంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు.