Share News

గిరిజనులకు శాశ్వత ఇళ్ల నిర్మాణానికి కృషి

ABN , Publish Date - Jan 01 , 2026 | 12:34 AM

నియోజకవర్గంలో గిరిజనుల కు శాశ్వత ఇళ్ల నిర్మాణానికి కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు.

గిరిజనులకు శాశ్వత ఇళ్ల నిర్మాణానికి కృషి
బెజ్జూరులో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందిస్తున్న సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

కౌటాల, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో గిరిజనుల కు శాశ్వత ఇళ్ల నిర్మాణానికి కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. బుధవారం కౌటాల మండల కేంద్రంలోని 38 మంది గిరిజన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని గిరిజనుల కోసం సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి 500 అదనపు ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేయించానని తెలిపారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లను మొదలు పెట్టి పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రమోద్‌, ఎంపీడీవో ప్రసాద్‌, సర్పంచ్‌ శంకర్‌, బక్కయ్య, భీంరావు, సత్తయ్య, సుమన్‌బాయి, మౌనిక, బిక్కు, పార్వతి, సూరజ్‌, మల్లేష్‌, చందు, శ్రీనివాస్‌, సంతోష్‌, మంగ, సంతోష్‌, వెంకటేష్‌, ఊష, వనిత, సవిత, ఉపసర్పంచ్‌ విజయ్‌ పాల్గొన్నారు.

బెజ్జూరు(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు అభివృద్ధిపై దృష్టిసారించాలని ఎమ్మెల్యే హరీష్‌బాబు సూచించారు. బుధవారం మండల కేందరంలోని రైతు వేదికలో 62 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎంపీఓ శ్రీనివాస్‌, నాయకులు శంకర్‌, తిరుపతి, రాజారాం, బాలకృష్ణ, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి) (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గిరిజనులకు మంజూ రు అయిన 19 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలను లబ్ధిదారులకు అందేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నాగమణి, ఉపసర్పంచ్‌ ప్రశాంత్‌, సర్పంచ్‌లు లావణ్య, రజిత, స్రవంతబాయి, సంతోష్‌, నాయకులు అశోక్‌, ఎంపీవో వినోద్‌, సిబ్బంది సదాశివ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 12:34 AM