Share News

జంగుబాయి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:37 PM

జంగుబాయి ఉత్సవాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చే యాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మంగళ వారం మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అధికారులు, గిరిజన సంఘాల నాయకుల తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

జంగుబాయి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

కెరమెరి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జంగుబాయి ఉత్సవాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చే యాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మంగళ వారం మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అధికారులు, గిరిజన సంఘాల నాయకుల తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జంగుబాయి ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. సుదుర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవం జంగుబాయి ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించాలన్నారు. జనవరి 17 వరకు ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొం టారన్నారు. పారిశుధ్యం, హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయడం నిరంతరం జరగాలన్నారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచి నిరంతర వైద్యసేవలు అందించాలన్నారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్‌ మార్మట్‌ మాట్లాడుతూ నీటి సరఫరా, మరుగుదొడ్లు అవసరమైన మేరకు ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్‌ రోడ్డుకు ఇరువైపులా మొక్కలను తొలగించే విధంగా చుడాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయలన్నారు. నెలరోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు బస చేయడానికి రెండు షెడ్లు ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరగా త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఐటీడీఏ పీవో పరందోళి సమీపంలో ఉన్న జంగుబాయి దేవస్థానాన్ని సందర్శించి భక్తులను, కమీటి సభ్యులను, నాయకులను ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసు కున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్‌, డీసీసీ అధ్యక్షురాలు, అత్రం సుగుణ, డీడీ రమదేవి, తహసీ ల్దార్‌ సంతోష్‌కుమార్‌, కమిటీ సభ్యులు అత్రం లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

పండుగలను సామరస్యంతో జరుపుకోవాలి

ఆసిఫాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ప్రజలు భక్తి మార్గం లో పండుగలను సామరస్యంతో జరుపుకోవాలని కలెక్ట ర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం అధికారికంగా నిర్వహించిన ముందస్తు క్రిస్మస్‌ వేడుకల్లో అదికారులు క్రైస్తవ మత పెద్దలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ అన్ని పండుగలను మత సామరస్యంతో సంతోషం గా జరుపుకోవాలని తెలిపారు. ఏసుక్రీస్తు శాంతి సందే శాన్ని ప్రజలకు బోధించారని, ప్రజలందరు పండగలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. క్రిస్మస్‌ పండుగ నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మం జూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఆహ్మద్‌ నదీం, డీఏవో వెంకటి, తహసీల్దార్‌ రయాజ్‌ఆలీ, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ ఆలీబీన్‌ ఆహ్మద్‌, రాజంపేట సర్పంచ్‌, ఉపసర్పంచులు బుర్స పోచయ్య, మామిడి లక్ష్మి, క్రైస్తవ మతపెద్దలు, ఫాస్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 11:37 PM