ఏజెన్సీ భూమిని కస్టడీకి తీసుకోండి
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:27 PM
జిల్లాలోని మందమర్రిలో గల షెడ్యూల్ ప్రాంతంలో (ఏజెన్సీ) కబ్జాకు గురైన భూమిని కస్టడీకి తీసుకోవాలం టూ ఉట్నూరులోని సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థ (ఐటీడీ ఏ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కునాల గంగాధర్ స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు.
-తహసీల్దార్‌కు ఉట్నూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశం
మంచిర్యాల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మందమర్రిలో గల షెడ్యూల్ ప్రాంతంలో (ఏజెన్సీ) కబ్జాకు గురైన భూమిని కస్టడీకి తీసుకోవాలం టూ ఉట్నూరులోని సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థ (ఐటీడీ ఏ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కునాల గంగాధర్ స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు. షెడ్యూల్ ప్రాంతమైన మందమర్రిలోని సర్వే నంబర్ 350/2/4లో 2.10 ఎకరాల భూమిని గిరిజనేతరుడైన బండి సదానందం అనే వ్యక్తి చట్ట విరుద్ధంగా ఆక్రమించడమే గాక అందులో ఫంక్షన్ హాలు నిర్మించినట్లు గిరిజన సంఘాల నాయకులు కొందరు ఉట్నూర్ స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విచారణలో భూమి ఆక్రమణకు గురైనట్లు వెల్లడికాగా, వెంటనే ప్రభుత్వ కస్టడీకి తీసుకోవాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి ఈనెల 16వ తేదీన మందమర్రి తహసీల్దార్‌కు ఆదేశా లు జారీ అయ్యాయి. మందమర్రి ప్రాంతంలో ఏజెన్సీ చట్టం ఎల్‌టీఆర్ 1/70 అమలులో ఉండగా, ఇక్కడి భూముల క్రయవిక్రయాలు కేవలం గిరిజనుల మధ్యనే జరగాల్సి ఉంది. గిరిజనేతరులు ఒక్కడి భూములు కొనుగోలు చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధం. దీనికి భిన్నంగా అట్టి భూ ములకు గిరిజ నేతరులు క్రయ, విక్ర యాలు జరిపితే ఎల్‌టీఆర్ 1/70 సెక్షన్ 3 (1) ప్రకారం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఆక్రమ ణకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసు కొని పరిరక్షిస్తుంది. కాగా బండి సదానందం అధికార పార్టీ నాయకుడు కావడంతో భూమిని కస్టడీలోకి తీసుకోకుండా ఉండేలా అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.అధికారులు ఒత్తిళ్లకు తలొ గ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి భూమిని ప్రభు త్వ కస్టడీకి తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకు లు కోరుతున్నారు.