Share News

నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:39 PM

మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పశువుల పెంపకం దారులు సద్వినియో గం చేసుకొవాలని మండల పశువె ౖద్యాధికారి మురళీకృష్ణ అన్నారు.

నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలి
జీవానికి నట్టల నివారణ మందు వేస్తున్న వైద్యాధికారి మురళీకృష్ణ

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పశువుల పెంపకం దారులు సద్వినియో గం చేసుకొవాలని మండల పశువె ౖద్యాధికారి మురళీకృష్ణ అన్నారు. మంగళవారం మండలం లోని అంకుశాపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ గంగారాంతో కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా 1800 జీవాలకు ఉచితంగా నట్టాల నివారణ మందులను వేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది మోతిరాం, ప్రశాంత్‌, వినోద్‌లు పాల్గొన్నారు.

వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోండి

బెజ్జూరు (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నిర్వహించే పశు వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని బెజ్జూరు సర్పంచ్‌ దుర్గం సరోజతిరుపతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ కాలనీలో పశువైద్య సిబ్బంది పశువులకు నట్టన నివారణ టీకాలు వేశారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ మాట్లాడుతూ పశువులకు వచ్చే వ్యాధుల నివారణకు యజమానులు నట్టల నివారణ టీకాలు వేయించాలని సూచించారు. గ్రామాల్లో నిర్వహించే శిబిరాల్లో టీకాలు వేయించినట్లయితే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపాలమిత్రలు మనోహర్‌, నేతాజి పాల్గొన్నారు.

కెరమెరి (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండల కేంద్రంలో మంగళవారం పశువైద్యాధికారి సురేష్‌కుమార్‌, సర్పంచ్‌ పెందూరు అనంద్‌రావు ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 200 పశువులకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రాజు తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 11:39 PM