Share News

సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:41 PM

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణిలకు సాధారణ ప్రసవం జరిగేలా చుడాలని జిల్లా వైద్యాధికారి సీతారాం సూచించారు.

సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి
ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో సీతారాం

జిల్లా వైద్యాధికారి సీతారాం

ఆసిఫాబాద్‌, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణిలకు సాధారణ ప్రసవం జరిగేలా చుడాలని జిల్లా వైద్యాధికారి సీతారాం సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో మంగళవారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్బంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ గర్భిణులకు హెచ్‌ఐవీ, సికిల్‌సెల్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయలన్నారు. అవసరమున్న వారికే స్కానింగ్‌ చేయాలని సూచించారు. సమావేశంలో అయా ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 11:41 PM