భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
కాగజ్‌నగర్ మండలంలో లోవోల్టేజీ సమస్యను తీర్చేందుకు కొత్తగా మూడు 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీ్‌ష్ బాబు తెలిపారు.
ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు సుస్థిర ఆదాయం ఉంటుందని కలెక్టర్ కె హరిత అన్నారు. దహెగాం మండలం ఐనం గ్రామంలో ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ఆత్మ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్ పంట సాగుపై రైతులకు సాగులో మెలకువలు, లాభాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. పంటల కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రతిరోజూ రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక పార్కు రాముని చెరువు సుందరీకరణ పనులకు సంవత్సరాలు గడుస్తు న్నా మోక్షం లభించడంలేదు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ప్రజలకు సెలవులు, ఖాళీ సమయాల్లో ఉల్లాసంగా గడపలేని పరిస్థితి నెలకొంది.
పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత అన్నారు.
బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. నస్పూర్ పోలీస్‌స్టేషనను మంగళవారం డీసీపీ భాస్కర్ సందర్శించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పంచాయతీకి ఒకటి చొప్పున నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి.
పట్టణంలోని ఎంజీ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో సోమవారం ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం పొక్లెయినర్‌తో దుకాణాలను తొలగించేందుకు ఆర్‌ఓబీ వద్దకు మున్సిపల్ అధికారులు చేరుకున్నారు.