Share News

విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:38 PM

రాష్ట్రంలో విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

 విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
లక్షెట్టిపేటలో విద్యార్థినులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

లక్షెట్టిపేట/హాజీపూర్‌ అక్టోబరు, 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట పట్టణం, హాజీపూర్‌లోని కస్తూర్బా గాంధీ పాఠశాలను కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ధనిక తేడా లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో సకల సదుపాయలు కల్పించడంతో పాటు కార్పొరేట్‌ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన సెలబస్‌పై విద్యార్థులను ఆరా తీసారు. హాజరు శాతం ఎప్పటికప్పుడు పరిశీలించాలని గైరాజరు అయిన విద్యార్థులను గుర్తించి కారణాలు తెలుసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు నేర్చుకున్న పాఠశాలను బోర్డుపై చెప్పించారు. పాఠశాల పరిసరాలను, తరగతి గుదులు, వంటశాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వెంట పాఠశాల ప్రిన్సిపల్‌ కవిత, ఉపాద్యాయులు ఉన్నారు.

జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌: జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభావిత గ్రామాల్లో అవార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో జాతీయ రహదారి విస్తరణలో ఆర్బిట్రేషన్‌ సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రహదారి విస్తరణలో భాగంగా ప్రభావిత గ్రామాల్లో అవార్డుల జారీని వేగవంతం చేయాలని, ఆర్బిట్రేషన్‌ సంబంధిత రికార్డులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రంమలో ఆర్డీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ లక్ష్యాలను పూర్తి చేయాలి

జిల్లాలోని రైసుమిల్లులకు కేటాయించిన సీఎంఆర్‌ లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో రైసుమిల్లర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. రైసుమిల్లులకు కేటాయించిన సీఎంఆర్‌ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఖరీఫ్‌ 2025-26 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుందని, ఈ నేపఽథ్యంలో సీఎంఆర్‌ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, మేనేజర్‌ శ్రీకళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 11:38 PM