Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:37 PM

నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లాలతో కలసి ఎంపీడీ వోలు, గృహ నిర్మాణ శాఖ అదికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రధానమంత్రి జన్‌ మన్‌ పథకం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ పనులను వేగవతం చేయాలని, లబ్ధిదా రులతో మాట్లాడి పనులు ప్రారంభించే విధంగా అవగాహ న కల్పించాలన్నారు. లబ్ధిదారులకు మంజూరైన బేసిమెంట్‌ లెవల్‌ వరకు పూర్తి చేసిన వారి ఖాతా ల్లో విడతల వారీగా నగదు జమ చేసేందుకు చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందిస్తుందని లబ్ధిదారులు అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవా లన్నారు. స్లాబ్‌ స్థాయి వరకు పూర్తయిన ఇళ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి జన్‌ మన్‌ పథకం కింద 2,167 మంది లబ్ధిదారులను గుర్తిం చడం జరిగిందన్నారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఇళ్ల పను లను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. కా ర్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగ వంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి పంచాయతీ రాజ్‌ ఇంజనీర్లు, రోడ్డు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సోమ వారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ ఇం జనీరింగ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారులు, కల్వర్టులు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌ వాడీ భవనాల నిర్మాణాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి భవనం నిర్మాణాన్ని డిసెంబరు నెలా ఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రభుత్వ కార్యాలయా లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. రహదారులు, కల్వర్టుల మరమ్మతులకు నివేదిక అందించాలని జిల్లా అభివృద్ధి పనులలో స్థల సమస్యలు ఉన్నట్లయితే తహసీల్దార్‌ల సమన్వయం తో చర్యలు చేపట్టాలని తెలిపారు. జాతీయ ఉపాధిహామీ పథకం పనుల జాతరలో మంజూరైన వంటశాల, బాలికల మూత్రశాలల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, జడ్పీ సీఈవో లక్ష్మీనా రాయణ, జిల్లా గిరిజన అభివృద్ధి అదికారి రమా దేవి, జిల్లా పంచాయతీ అధికారి భిక్షతి, ఎంపీడీవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 11:37 PM