Share News

బాధితులకు సత్వర న్యాయం జరగాలి

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:39 PM

బాధితులకు సత్వర న్యాయం జరిగే లా చూడాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు.

బాధితులకు సత్వర న్యాయం జరగాలి
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

- ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యో తి): బాధితులకు సత్వర న్యాయం జరిగే లా చూడాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీక రించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించా లని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని తక్షణ పరిష్కా రం కోసం సంబంధిత సీఐలకు ఫోన్‌లో సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించు కునేలా ప్రజలకు మరింత దగ్గరమ్యేలా జిల్లా పోలీసు శాఖ పని చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరి స్తున్నామని అన్నారు.

ఎస్పీకి ఫిర్యాదు

ఆదివాసీ పర్దాన్‌ సమాజంపై అనుచి త వ్యాఖ్యలు, దుర్భాషలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ పర్దాన్‌ సమాజ్‌ జిల్లా నాయకులు ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియాలో తిర్యాణి మండలం మంగి గ్రామానికి చెందిన వెంకటేష్‌ అనే వ్యక్తి పర్దాన్‌ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు, దుర్భా షలాడడన్నారు. ఆ వ్యాఖ్యలు తమ మనో భావాలను దెబ్బతిసే విధంగా ఉన్నాయ ని వెంకటేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వందన, బుదబాయి, ప్రేంకు మార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 11:39 PM