పద్మల్‌పురి కాకో ఆలయంలో దండారి సందడి
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:40 PM
మండలంలోని పద్మల్‌పురి కాకో ఆలయానికి ఆదివాసీలు తరలివచ్చి అమ్మవారికి ఆదివాసీలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
పద్మల్‌పురి కాకో ఆలయంలో దండారి సందడి
దండేపల్లి అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పద్మల్‌పురి కాకో ఆలయానికి ఆదివాసీలు తరలివచ్చి అమ్మవారికి ఆదివాసీలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూ ల నుంచి మంగళవారం వందలాదిమంది గిరిజనులు కుటుంబ సమేతంగా కాకో అమ్మవారిని దర్శించుకున్నారు. దీపావళి పండుగ ముగిసే వరకు గిరిజన సాంప్రదాయబద్దంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. గిరిజనులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి జలాభిషేకం చేసేందుకు గిరిజనులు డప్పువాయిద్యాలతో గుస్సాడీ వేషాధారణలు, నృత్యాలతో ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి కాకో అమ్మవారికి జలాభిషేకం చేశారు.
గిరిజన సంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలే
గిరిజన సంస్కృతీసంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలేనని తెలంగాణ రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైౖర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. దండేపల్లి మండలం గుడిరేవులో పద్మల్‌పూరీ కాకో ఆలయంలో దండారీ గుస్సాడి వేడకుల సందర్బంగా మంగళవారం కాకో ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దరించుకున్నారు.
గుస్సాడి దర్బార్‌కు కలెక్టర్, డీసీపీలకు ఆహ్వానం
దండేపల్లి మండలం గుడిరేవులో పద్మల్ పూరీ కాకో ఆలయంలో ఈ నెల 17 శుక్రవారం నిర్వహించే గుస్సా డి దండారీ దర్బార్ ఉత్సవానికి రావాలని కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్‌కు ఆలయ కమిటీ నిర్వా హకులు మంగళవారం మంచిర్యాలలో కలిసి ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొమురం హన్మంత్‌పటేల్, నిర్వాహకులు కనక జంగు, ఆత్రం జలపతి, సోయం జంగు, మధు ఉన్నారు.