Komaram Bheem: దారుణం.. కొడుకు చేసిన పనికి కోడలిని చంపిన మామ
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:21 PM
కొమురం భీం జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి రాణి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. శేఖర్ బీసీ కులానికి చెందిన వ్యక్తి కాగా.. రాణి ఎస్టీ కులానికి చెందిన యువతి.
ఆదిలాబాద్: ఇటీవల కాలంలో ప్రేమ కారణంగా జరుగుతున్న నేరాల సంఖ్య బాగా పెరుగుతోంది. పెద్దలు ఒప్పుకోలేదని కొన్ని ప్రేమ జంటలు సూసైడ్ చేసుకుంటున్నాయి. అలానే తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నారని కొందరు పెద్దలు పరువు హత్యలకు పాల్పడుతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. మరికొందరు పెద్దలు ప్రేమ పెళ్లి చేసినట్లే నమ్మించి.. అల్లుడు లేదా కోడల్ని అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. ఈ తరహా ఘటన తాజాగా కొమరం భీం జిల్లాలో చోటుచేసుకుంది. గర్భిణీగా ఉన్న కోడలిని మామ అత్యంత దారుణంగా హత్య చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కొమురం భీం జిల్లా(Komaram Bheem District) దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి రాణి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. శేఖర్ బీసీ కులానికి చెందిన వ్యక్తికాగా.. రాణి ఎస్టీ కులానికి చెందిన యువతి. కుమారుడు వేరే కులం అమ్మాయిని వివాహం(Love Marriage) చేసుకున్నాడని శేఖర్ తండ్రి సత్తయ్య ఆగ్రహంతో ఉన్నాడు. ఇదే సమయంలో రాణి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు ఎనిమిదో నెల. దీంతో శేఖర్, రాణి దంపతులు సంతోషంగా ఉన్నారు.
తమ ఫ్యామిలీలోకి బేబీ రాబోతుందని ఆనందపడుతున్నారు. అయితే వారి ఆశలను శేఖర్ తండ్రి సత్తయ్య అడియాసలు చేశాడు. అంతేకాక కోడలు గర్భవతి అనే విషయాన్ని మరిచి.. దారుణానికి తెగబడ్డాడు. ఎనిమిది నెలల గర్భిణీ అయిన కోడలు రాణిని సత్తయ్య గొడ్డలి(Father In Law Attacked On Daughter In Law)తో నరికి చంపాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
చెట్టు మీద పిల్లి.. 7 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్..
డోస్ పెంచిన ట్రంప్.. 9వ యుద్ధాన్ని ఆపడానికి రెడీ..