Meta AI: ఫోన్‌లోని ఫొటోలను మెటా ఏఐతో ఎడిటింగ్.. అది సురక్షితమేనా..
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:14 PM
మెటా సంస్థ ఫేస్‌బుక్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అది మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఫీచర్. ఆ ఫీచర్ సహాయంతో మీరు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోలనే కాదు.. మీ ఫోన్‌లోని ఫొటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు.
మెటా సంస్థ ఫేస్‌బుక్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అది మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఫీచర్. ఆ ఫీచర్ సహాయంతో మీరు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోలనే కాదు.. మీ ఫోన్‌లోని ఫొటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికా, కెనడాలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్ అందుకున్న వినియోగదారులు మెటాకు కొన్ని కీలక అనుమతులు ఇవ్వాలి (photo suggestion feature).
క్లౌడ్ ప్రాసెసింగ్‌ను అనుమతించాలి. మీ ఫోన్‌లోని ఫొటోలను పరిశీలించేందుకు మెటాకు యాక్సెస్ ఇవ్వాలి. ఈ ఫీచర్‌లో ఫొటోలకు సంబంధించి కోల్లెజ్‌లు, రీక్యాప్‌లు, ఏఐ రీస్టైలింగ్, పుట్టినరోజు థీమ్‌లు వంటి ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం మీరు మీ ఫోన్‌లోని ఫొటోలను క్లౌడ్‌లోకి అప్‌లోడ్ చేయాలి. అక్కడ వాటిని మెటా ఏఐ విశ్లేషించి పలు సూచనలు చేస్తుంది. వాటిల్లో మీకు నచ్చిన విధంగా మీ ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వద్దనుకుంటే ఎప్పుడైనా నిలిపివేయవచ్చు (phone photos privacy).
ఇలా ఫోన్‌లోని ఫొటోల కోసం ఏఐకు అనుమతినివ్వడం భద్రతా పరమైన చిక్కులు తీసుకొస్తుందని చాలా మంది భయపడుతున్నారు (Facebook camera roll AI). మెటా ఏఐ ఎడిటింగ్ కోసం ఫోటో తీసుకున్న తేదీ, స్థలం, దానిలోని వ్యక్తులకు సంబంధించిన కీలక సమాచారం ఇవ్వాలి. అంటే మీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన కీలక సమాచారాన్ని మెటాకు అందించాలి. వ్యక్తుల కీలక సమచారం ఏఐకి చిక్కితే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందోనని చాలా మంది భయపడుతున్నారు. ఈ భయాల గురించి మెటా సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
అరట్టై వర్సెస్ వాట్సాప్.. వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసా
వారానికి ఒక్కసారన్నా స్మార్ట్ ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి.. ఇలా ఎందుకంటే..
Read Latest and Technology News