Share News

Vision Of Vishwagurukulam: తానా బోర్డు అఫ్ డైరెక్టర్ సాహస యాత్ర.. విశ్వగురుకులం సిద్ధాంతంతో..

ABN , Publish Date - Oct 18 , 2025 | 03:55 PM

కిలిమంజారో పర్వతం టాంజానియాలో ఉంది. ఇది ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన పర్వతం (5895 మీటర్లు/19,341 అడుగులు). ఇది మూడు గొప్ప అగ్నిపర్వత శిఖరాలైన కిబో, మావెన్జీ, షిరా కలయికతో ఏర్పడింది.

Vision Of Vishwagurukulam: తానా బోర్డు అఫ్ డైరెక్టర్ సాహస యాత్ర.. విశ్వగురుకులం సిద్ధాంతంతో..
Vision Of Vishwagurukulam

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డు అఫ్ డైరెక్టర్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. పురాణ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన తానా విశ్వగురుకులం అనే ప్రత్యేక బోధన పద్దతిని ప్రపంచానికి.. మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని తెలుగు వారికి పరిచయం చెయ్యటంలో భాగంగా ఈ సాహస యాత్ర సాగించారు. తానా విశ్వ గురుకుల బోధనా వ్యాప్తికి, తానా సిద్ధాంతాలు వ్యవస్థాపక లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో క్లిష్టమైన 7 సమ్మిట్స్ యాత్రకి శ్రీకారం చుట్టారు.


7 సమ్మిట్స్ (7 ఖండాలలో ఎత్తైన పర్వత శిఖరాలు) అధిరోహించే క్రమంలో భాగంగా ఇప్పటికే మౌంట్ ఎల్బ్రస్, కిలిమంజారో పర్వతాలను అధిరోహించారు. గత మాసంలో యూరప్ ఖండంలోనే ఎత్తైన పర్వతం రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ ( 5642 మీటర్లు/18,510 అడుగులు) అధిరోహించారు. తానా చేసే సేవా కార్యక్రమాలని ప్రోత్సహించడంతో పాటు 2027లో జరిగే తానా స్వర్ణోత్సవాలని విజయవంతం చెయ్యాలని.. వాటికి అందరి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.


పర్వతాల విశేషాలు..

కిలిమంజారో పర్వతం టాంజానియాలో ఉంది. ఇది ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన పర్వతం (5895 మీటర్లు/19,341 అడుగులు). ఇది మూడు గొప్ప అగ్నిపర్వత శిఖరాలైన కిబో, మావెన్జీ, షిరా కలయికతో ఏర్పడింది. ఆఫ్రికా ప్రజలు దేవతలు సంచరించే ప్రాంతంగా ఈ పర్వతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు . మౌంట్ ఎల్బ్రస్ రష్యాలోని కకాసస్ పర్వతాల్లో ఉంది. ఇది యూరప్ ఖండంలోనే ఎత్తైన పర్వతం (5642 మీటర్లు/18,510 అడుగులు). ఈస్ట్, వెస్ట్ శిఖరాల కలయికతో దీనిని ద్విశిఖర అగ్నిపర్వతం అని పిలుస్తారు. గతంలో వోల్కానిక్‌ చర్యలు జరిగిన సూచనలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

2 ఏళ్లుగా జీతాల్లేవ్.. తీవ్ర మనోవేదనకు గురై..

డోస్ పెంచిన ట్రంప్.. 9వ యుద్ధాన్ని ఆపడానికి రెడీ..

Updated Date - Oct 18 , 2025 | 04:01 PM