Share News

No Salary For 2 Years: 2 ఏళ్లుగా జీతాల్లేవ్.. తీవ్ర మనోవేదనకు గురై..

ABN , Publish Date - Oct 18 , 2025 | 03:31 PM

చికూస నాయక గత కొన్నేళ్ల నుంచి గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి అతడికి జీతం అందటం లేదు. ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు.

No Salary For 2 Years: 2 ఏళ్లుగా జీతాల్లేవ్.. తీవ్ర మనోవేదనకు గురై..
No Salary For 2 Years

ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు. తాను పని చేసే ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చామరాజనగర్ జిల్లాలోని హొంగనూరు గ్రామానికి చెందిన చికూస నాయక గత కొన్నేళ్ల నుంచి గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి అతడికి జీతం అందటం లేదు. ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. పైగా చికూసను మానసికంగా ఇబ్బంది పెట్టేవారు. సెలవులు కూడా ఇచ్చే వారు కాదు. రోజు, రోజుకు అధికారుల వేధింపులు పెరగటంతో చికూస తీవ్ర మనోవేధనకు గురయ్యాడు.


ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఓ సూసైడ్ నోట్ రాశాడు. అందులో... ‘నేను హాంగనూరు గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో 2016నుంచి పని చేస్తున్నాను. రెండేళ్లుగా నాకు జీతం ఇవ్వటం లేదు. జీతం సెటిల్‌మెంట్ చేయమని ఎంత అడిగినా పట్టించుకోలేదు. ఆరోగ్యం బాగోలేదని రాజీనామా ఇచ్చాను. దానికి కూడా అధికారులు స్పందించలేదు. జిల్లా పంచాయతీ సీఈఓను కూడా కలిశాను. ఆయన కూడా పట్టించుకోలేదు.


నేను సెలవు కావాలని అడిగితే పీడీఓ ఇచ్చేవాడు కాదు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పని చేయించుకునేవారు. పీడీఓ మోహన్ కుమార్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని రాశాడు. అనంతరం గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక, పోలీసులు పీడీఓ, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్, ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారులు ఈ సంఘటనపై సీరియస్ అయ్యారు. జిల్లా పంచాయతీ సీఈఓ రామె గౌడను విధులనుంచి తొలగించారు. కాగా, రెండు రోజుల క్రితం కలబురగికి చెందిన ఓ లైబ్రేరియన్ ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల్లో ఇది రెండో ఘటన కావటం గమనార్హం.


ఇవి కూడా చదవండి

చెట్టు మీద పిల్లి.. 7 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్..

డోస్ పెంచిన ట్రంప్.. 9వ యుద్ధాన్ని ఆపడానికి రెడీ..

Updated Date - Oct 18 , 2025 | 03:52 PM