మళ్లీ పెద్దపులి కదలికలు
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:41 PM
వారం రోజుల క్రితం తెలంగాణ- మహారాష్ట్ర సరిహ ద్దు ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో పులి కదిలికలు ఉన్నాయని అటవీ అధికారులు గుర్తించా రు.
- మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి ప్రవేశం
- ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
పెంచికలపేట, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల క్రితం తెలంగాణ- మహారాష్ట్ర సరిహ ద్దు ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో పులి కదిలికలు ఉన్నాయని అటవీ అధికారులు గుర్తించా రు. ఏ క్షణానైనా జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉం దని అటవీ అధికారులు ముందుగానే గుర్తించి అటవీ ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులు అనుకున్నట్లుగానే పులి కదిలికలు కాగజ్ నగర్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం మీదుగా దహెగాం మండలం వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్వో అనిల్‌కుమార్‌ను సంప్రదించగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత తీర ప్రాంతంలో నుంచి పులి జిల్లాలోకి ప్రవేశించిందని పెంచికలపేట రేంజ్ పరిధి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే అవకా శం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పిల్లలా... పులేనా...
ప్రాణహి పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్న పులితో పాటు పులి పిల్ల కూడా ఉందని అధికారులు వారం రోజుల క్రితమే గుర్తించారు. అయితే ఇప్పుడు జిల్లాలోకి ప్రవేశించిన పులి అదేనా అని అనుమా నా లు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పులి కలయిక సమయంలో క్రూరంగా ప్రవర్తిస్తూ మను షులపై దాడి చేస్తుంది. కానీ పిల్ల పులి అంతకంటే ప్రమాదక రంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఆ యా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అ ధికారులు సూచిసున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
దహెగాం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): పెద్దపులి సంచరిస్తున్నందున దహెగాం మండల ప్రజలు అప్రమత్తంగా ఉడాలని అటవీ శాఖ సిబ్బంది అన్నారు. సోమవారం దహెగాం మండలం పెసరికుంట, పోలంపల్లి, మురళీగూడ గ్రామాల్లో పులి అడుగులను గుర్తించినట్లు తెలిపారు. బీబ్రా, జెండాగూడ, దుబ్బగూడ, పోంపల్లి, మురళీగూడ గ్రామాల్లో పులి సంచారం ఉన్నందున ప్రజలు గుంపులుగా వ్యవసాయ పనులకు వెళ్లాలని సూచించారు. పులి కాగజ్‌నగర్ మండలం సార్సాల నుంచి పెద్దవాగు దాటి పెసరికుంట గ్రామం మీదుగా పొలంపల్లి, మురళీగూడ గ్రామాల వైపు వెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంచికలపేట, రెబ్బెన మండలాల అటవీ అధికారులు పాల్గొన్నారు.