ఆసిఫాబాద్‌లో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా బాలికను సురక్షితంగా బయటకు తీశారు.
భగ్గుమంటున్న ఎండల కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతోంది. వారం పదిరోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. విపరీతమైన దాహార్తితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్య ప్రతాపం కారణంగా మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఆన్‌లైన్ మందుల అమ్మకాలపై నియంత్రణ చేపట్టాలని మంచిర్యాల డిస్ర్టిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా గొల్లపల్లి రైతులు బుధవారం ధర్నాకు దిగారు. బస్తాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి బైఠాయించారు.
ఎండలు మండిపోతున్నాయి. చెరువులు, వాగుల్లో నీరు ఇంకిపోతున్నాయి. గ్రామాల్లో పశుగ్రాసం, నీరు దొరకక మూగజీవాలు దాహంతో అలమటిస్తున్నాయి.
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో కూరగాయలు విక్రయించేందుకు వ్యాపారులకు సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడింది. తైబజార్ టెండరులో మున్సిపాలిటీకి ఆదాయం వస్తున్నా వసతుల కల్పించటం లేదని పలువురు పేర్కొంటున్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు.
రాష్ట్రంలో వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవించేటప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
నిర్మల్... ఒక భౌగోళిక ప్రదేశం కాదు... కాలగర్భంలో చెక్కబడిన ఒక జ్ఞాపకగాథ. సహ్యాద్రి శ్రేణుల నిశ్శబ్ద వీణలో, గోదావరి పరవళ్లలో, దక్కన్ పీఠభూమి రాతిగుట్టల ఎత్తుపల్లాల ఊపిరిలో... ఈ నేల శతాబ్దాల సంచారాన్ని మోస్తోంది.
జిల్లావ్యాప్తంగా పంటల మార్పిడి జరగకపోవడంతో రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో పప్పు దినుసులు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగు ఏటేటా తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.