పార్టీ బలోపేతానికి కృషిచేయాలి
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:31 PM
బీజేపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు సూచించారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): బీజేపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు సూచించారు. బుధవారం బీజే పీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పండిత్ దీన్‌ద యాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల్లో పాల్గొని విజయవం తం చేయాలని ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ప్రతి బూత్‌లో బీఎల్‌ఏలను నియమించి ఓటరు మార్పులు, చేర్పులు, తొలగింపులపై ప్రత్యేక దృష్టి పెట్టాల న్నారు. అనంతరం ఆసిఫాబాద్ బార్ ఆసోసి యోషన్ అధ్యక్షుడిగా ఇటివల ఎన్నికైన బీజేపీ సీనియర్ నాయకులు బోనగిరి సతీష్‌బాబును పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్‌బాబు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షు డు ధోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, నాయకులు మల్లికా ర్జున్, విజయ్, శ్రీనివాస్, అనిత, కృష్ణకుమారి, విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు.