సమస్యలు తెలుసుకొని.. భరోసా కల్పించి..
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:14 PM
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థా యిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అధికారులను ఆదేశించారు.
అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ హరిత
ఆసిఫాబాద్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థా యిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ భవన సము దాయంలోని సమావేశ మందిరంలో నిర్వహిం చిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను క్షత్రేస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు. వివిధ సమస్యలపై ప్రతికల్లో వచ్చిన ప్రతికూల వార్తలపై అధికారులు వెంటనే స్పందించి చర్య లు తీసుకోవాలన్నారు.
అనంతరం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన బైసాబేగం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయా లని దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ మండలం జెండాగూడకు చెందిన లోకండే పెంటుబాయి తన భర్త మరణించినందున వితంతువు పెన్షన్ మంజూరు చేయాలని, కెర మెరి మండలం పరందోళి గ్రామానికి చెందిన వైౖజనాథ్ తాను చేపట్టిన రహదారి మరమ్మతు పనులు బిల్లులు చెల్లించాలని దరఖాస్తు చేసు కున్నారు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన షాన్ మహ్మద్ తనకు రావాల్సిన పెన్షన్ నిలుపుదల చేసినందుకు పెన్షన్ ఇప్పించాలని కోరారు. కాగజ్‌నగర్ పట్టణం పోచమ్మ బస్తీకి చెందిన రామన్ తన పట్టా భూమిని భూ కొలతల అధికారితో కొతలు చేయించాలని దరఖాస్తు అందజేశారు. జైనూరు మండలం గౌరి గ్రామానికి చెంది న మేస్రం శేఖు తనకు వ్యవసాయ బావి మం జూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. సిర్పూర్(టి) మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన దుర్గమ్మ తాను సాగు చేస్తున్న ప్రభు త్వ భూమిని లావుని పట్టా చేయుట గురించి దరఖాస్తు చేసుకున్నారు.
కాగజ్‌నగర్ పట్టణం సర్‌సిల్క్ కాలనీకి చెందిన గుండె సమ్మక్క తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిపై నుంచి విద్యత్ తీగలు వెళ్తున్నందున సరిచేయాలని దరఖాస్తు చేసు కున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధి త అధికారులు పాల్గొన్నారు.