లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:30 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నాలుగు లేబర్ కోర్డులను రద్దు చేయాలని గోలేటి సీహెచ్‌పీలో హెచ్‌ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించిన బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
రెబ్బెన, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నాలుగు లేబర్ కోర్డులను రద్దు చేయాలని గోలేటి సీహెచ్‌పీలో హెచ్‌ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించిన బుధవారం నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదించి 60 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కుట్ర చేస్తుం దని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఆరీఫ్, ఉమామహేశ్వర్, బాలేష్, దీపక్‌రాజ్, రాజేష్, పా ల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో లేబర్ కోడ్ ప్రతుల ను దహనం చేశారు. నాయకులు ఉపేందర్, రమేష్, దేవాజీ, ప్రవీణ్, దుర్గాజీ, నర్సయ్య, లక్ష్మి, శోభ పాల్గొన్నారు.
కెరమెరి: లేబర్ కోర్డులను రద్దు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంతోష్, నగేష్, శ్రీనివాస్, వెంకటేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్ కార్డులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు విలాస్, జె.విలాస్, తదితరులు ఉన్నారు.