బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం
ABN , Publish Date - Mar 22 , 2026 | 02:04 PM
ఇటీవలి చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ యాజమాన్యం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి.. సోమవారం నుంచి పీయూసీ 1,2.. ఇంజనీరింగ్ 1,2 సంవత్సరాల విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
నిర్మల్, మార్చి 22: ఇటీవలి చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ యాజమాన్యం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి.. సోమవారం నుంచి పీయూసీ 1,2.. ఇంజనీరింగ్ 1,2 సంవత్సరాల విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ క్లాసులు ఎప్పుడు నుంచి ప్రారంభించేది తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో విద్యా్ర్థిని మృతి చెందింది. దీంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. దాంతో కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిపాలన పరంగా కొంత ఇబ్బందులు సైతం తలెత్తాయి.
ఈ నేపథ్యంలో యాజమాన్యం సెలవులు ప్రకటించింది. ఈ ఆందోళనల్లో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఉద్యోగస్థులు తమ డిమాండ్ల కోసం ఆందోళనకు దిగారు. ఇన్‌చార్జి వీసీ రంగంలోకి దిగి ట్రిపుల్ ఐటీ కాలేజీ ఉద్యోగులతో చర్చలు జరిపారు. మీ డిమాండ్లను త్వరలో పరిష్కరిస్తామని వారికి వీసీ హామీ ఇచ్చారు. ఇక కాలేజీలో సైతం ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేందుకు విద్యార్థులకు ఉన్నతాధికారులు సెలవులు ప్రకటించినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
హామీల అమలుకే నిధులు లేవు.. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడివి?: టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
For More TG News And Telugu News