Share News

ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

ABN , Publish Date - Mar 22 , 2026 | 08:31 AM

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్(ట్రైనీ) ఉద్యోగాల భర్తీని త్వరలో పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీఎస్ఆర్టీసీ విడుదల చేసింది.

ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్(ట్రైనీ) ఉద్యోగాల భర్తీని త్వరలో పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీఎస్ఆర్టీసీ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

ఒక వేళ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే support@tslprb.inకు ఈ మెయిల్ చేయవచ్చని అభ్యర్థులకు స్పష్టం చేసింది. లేకుంటే 9391005006 నెంబర్‌ను సంప్రదించాలని వివరించింది. అయితే హాల్ టికెట్‌పై ఫొటో లేని అభ్యర్థులను పరీక్షకు అనుమతించబోమని తెలిపింది. అలాగే పరీక్ష సమయంలో అభ్యర్థుల వేలిముద్రలు, డిజిటల్ ఫొటోలను సేకరిస్తారని పేర్కొంది. ఈ నేపథ్యంలో చేతులకు మెహందీ, టాటూలు ఉండకూడదని చెప్పింది.


హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మార్చి 29వ తేదీ ఆదివారం ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు.. మళ్లీ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. తమ హాల్ టికెట్లను మార్చి 23వ తేదీ ఉదయం 8.00 గంటల నుంచి మార్చి 28వ తేదీ ఆర్థరాత్రి వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.


మొత్తం 198 ట్రాఫిక్ సూపర్‌వైజర్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైయినీ పోస్టుల భర్తీకి టీజీఎస్ఆర్టీసీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ పోస్టులు, 114 మెకానికల్ సూపర్ వైజర్ ట్రయినీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 26,160 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లు పెడతాం: కేటీఆర్‌

For More TG News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 10:10 AM