6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లు పెడతాం: కేటీఆర్
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:16 AM
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ఉభయసభల్లో పెట్టడానికి బీఆర్‌ఎస్ సన్నద్దమైంది
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ఉభయసభల్లో పెట్టడానికి బీఆర్‌ఎస్ సన్నద్దమైంది. మాజీ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌తో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో ఆ పార్టీ నేతలు సోమ భరత్, మోహన్‌రావు, వినోద్ కుమార్, ప్రొఫెసర్ శ్రవణ్ శనివారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై విఫలమైనందుకే ప్రైవేటు బిల్లును శాసనసభ, శాసన మండలిలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే ప్రైవేటు బిల్లును ప్రవేశ పెడుతున్నట్లు కేటీఆర్ మీడియాకు చెప్పారు.