ఉషస్సుల ఉగాది.. నవ్యతకు నాంది
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:07 AM
ఉగాది పండగ నుంచే కొత్త ఏడాది మొదల వుతోంది. తెలుగు సంవ త్సరం శిశిర రుతువు ఫాల్గుణ అమావాస్య ముగియడంతో మరుసటిరోజు నూతన తెలుగు సంవత్సరం ఆరంభమవుతుంది.
- నేడు పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం
- ఆలయాల్లో పూజలు, పంచాంగ శ్రవణాలు
నస్పూర్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఉగాది పండగ నుంచే కొత్త ఏడాది మొదల వుతోంది. తెలుగు సంవ త్సరం శిశిర రుతువు ఫాల్గుణ అమావాస్య ముగియడంతో మరుసటిరోజు నూతన తెలుగు సంవత్సరం ఆరంభమవుతుంది. గడిచిన సంవత్సర అనుభవాల నుంచి ఆనందపు వెలుగు వైపునకు అడుగులు పడతాయి. ప్రకృతిలో కొత్త చిగుళ్లతో వృక్షాలు ఆకుపచ్చని శోభతో లేత మామిళ్లు, వేపపూతలు, ఫల పుష్పవృక్షాల గుభాళింపుల తో, ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణ సౌరభాలను మోసుకువస్తూ, ఉగాది ఆనందపు హరి విల్లులు, పక్షుల కిలకిలరావా లు, కోయిలమ్మల కూతలు వీనుల విందుతో ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. తెలుగు తొలి మాసమైన చైత్రాన్ని, పక్షాల్లో మొదటి దైన శుక్ల పక్షాన్ని, తిథిలలో మొదటిదైన పాడ్యమి తిథినీ, రోజుకో ప్రథమార్థమైన పగటి సమయాన్ని, పగటి లోనూ ముందుగా వచ్చే బ్రహ్మముహూర్తాన్ని, ప్రథమ శ్వాసను ఎంచుకుని బ్రహ్మ సృష్టి ప్రారంభించారని ప్రతీతి. ఉగాది కొత్త సంవత్సరం పరాభవ నామ సంవ త్సరం ప్రారంభమ వుతుంది. ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా వచ్చే మొట్టమొదటి పండగ ఉగాది. ఉగాది అంటేనే ప్రతి ఒక్కరి మదిలో ఆనందం వెల్లివిరుస్తుంది. పల్లెల నుంచి పట్టణాల వరకు ఆరు రుచుల కలయికతో పచ్చడిని తయారుచేస్తారు. మంచి ర్యాల జిల్లాలో ఉగాది పర్వదినాన్ని గురువారం ఘనంగా నిర్వహించుకోవడానికి ఆయా ఆలయాల్లో పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు.
- మారుతున్న కాలంతోపాటు.
మారుతున్న కాలంతో పాటు మనుషుల శరీర మానసిక స్థితిగతులల్లో కూడా మార్పు లు చోటు చేసు కుంటాయి. శిశిరం నుంచి వసంత రుతువులోకి కాలం మారే సమయం లో రోగాల వ్యాప్తి సహజంగా జరుగు తుంది. ఆరు రుచులను రంగరించిన పచ్చడి రుతు మార్పులకు అనుగుణంగా వచ్చే వాత పిత్త దోషాల నుహరించే ఔషధంగా పనిచేస్తుం దని నమ్ముతారు. ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదులను కలగలపుగా తయారయ్యే పచ్చడిని స్వీకరిం చే ఆచారం ఉగాది నాడు మాత్రమే ఉంటుం ది. పచ్చడిలో వినియోగించే అన్ని వస్తువుల ను ఈ రుతువులో లభించే కొత్త కాత నుంచే సేకరిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంవత్సరంలో మంచి చెడులు, ఆదాయ ఖర్చులు తెలుసుకుంటారు.