Share News

విధులు సక్రమంగా నిర్వర్తించాలి

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:28 PM

విధులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ కె హరిత అధికారు లకు సూచించారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని బుధవారం ఆకస్మికం గా తనిఖీ చేశారు.

విధులు సక్రమంగా నిర్వర్తించాలి
సిర్పూర్‌(టి) ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

- కలెక్టర్‌ కె హరిత

- సమయపాలన పాటించని సిబ్బందిపై ఆగ్రహం

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): విధులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ కె హరిత అధికారు లకు సూచించారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని బుధవారం ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది సమయపా లన పాటించకపోవడంతో వివరాలు అడిగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని వార్డులను కలియ తిరిగి వివరాలను అడిగి తెలుసుకు న్నారు. సిబ్బంది అందరు 9.30 గంటలకే ఆసుపత్రికి వచ్చి అందరి సెల్ఫీ ఫొటో దిగి తమకు పంపించాలని ఆదేశించారు. సమయపాలన పాటించని వారిపై డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో మాట్లాడి వారిపై చర్యలు తీసు కోవాలని సూచించారు. ఎంతటి వారైనా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. అనంతరం మందుల స్టాక్‌ గదిని పరిశీలించి వివరాలు తెలుసుకు న్నారు. అలాగే ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న రోగుల తో వివరాలు తెలుసుకున్నారు. ఎంపీడీవో సత్యనారాయ ణ, ఈవో తిరుపతి, సర్పంచ్‌ నాగమణి, డాక్టర్‌ అనూష, డాక్టర్‌ స్వరూప్‌, హెడ్‌ నర్సు షభానా, ఏఎన్‌ఎంలు, సిబ్బంది ఉన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాల యాన్ని తనిఖీ చేసి రికార్డులను, హాజరు పట్టికలను పరిశీలించారు. తహసీల్దార్‌ రహీముద్దీన్‌తో మాట్లాడు తూ భూభారతి, రెవెన్యూ సదస్సు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్‌లు, విద్యార్థులకు సర్టిఫికేట్లను 24 గంటలలోపే ఇవ్వాలని సూచించారు. గురువారం నిర్వహించే గ్రామసభలను అన్ని గ్రామపంచాయతీల్లో విజయవం తం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అధికారుల నివాస గృహాలను త్వరగా పూర్తిచేయండి

ఆసిఫాబాద్‌: జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్మిస్తు న్న అధికారుల నివాస సముదాయాన్ని కలెక్టర్‌ కె హరి త పరిశీలించారు. నిర్మాణ పననుల నాణ్యతను పురోగ తిని సమీక్షించారు. నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారుల నివాసా లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగ కుండా చూడడంతో పాటు జిల్లా అధికారలకు నివాస యోగ్యంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశిం చారు. ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, కలెక్టరేట్‌ ఏవో కిరణ్‌ ఉన్నారు.

జనాభా లెక్కలను పకడ్బందీగా చేపట్టాలి

ఆసిఫాబాద్‌: జిల్లాలో జనాభా లెక్కలు -2027 ప్రక్రి యను పకడ్బంధీగా చేపట్టాలని కలెక్టర్‌ కె హరిత ఆదే శించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మూడు రోజులుగా ఫీల్డ్‌ ట్రైనర్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ మండలస్థాయి గణికులు శిక్షణ ఇచ్చేందుకు ప్రతీ మండలం నుంచి ఒకరి చొప్పున ఫీల్డ్‌ ట్రైన్లను ఎంపిక చేసి వారికి మూడు రోజుల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చామన్నారు. జనాభా లెక్క సేకరణలో అనుసరించాల్సిన పద్ధతులు, సాంకేతిక అంశాలపై ఫీల్డ్‌ ట్రైనర్లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో సీపీవో వాసుదేవరెడ్డి, మాస్టర్‌ ట్రైనర్‌ హుస్సేన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 11:28 PM