Share News

విద్యార్థుల ఆకలి బాధలకు సెలవు

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:16 PM

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రీప్రైమరీ నుంచి జూనియర్‌ కళాశాలల విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

విద్యార్థుల ఆకలి బాధలకు సెలవు

- కేజీ నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు

అల్పాహారం, మధ్యాహ్న భోజనం

- రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు

- హాజరు శాత ం పెరిగేందుకు అవకాశం

వాంకిడి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రీప్రైమరీ నుంచి జూనియర్‌ కళాశాలల విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. జిల్లాలో మొత్తం 11 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 5,000లకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాలనుంచి మండలాల్లోని ప్రలు గ్రామాలు దాదాపు 12 నుంచి 15 కిలోమీటర్లు దూరం ఉన్నాయి. పరిసర గ్రామాల నుంచి సరైన రవాణా సదుపాయాలు లేక విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరు కావడంలేదు. పైగా ఇంటి నుంచి బయల్దేరే సమయానికి భోజనం తయారు కాకపోవడం, బస్సులు అందవన్న కారణంగా చాలా మంది విద్యార్థులు ఖాళీ కడుపుతోనే కశాళాలకు వస్తున్నారు. ఉదయం కశాళాలకు వచ్చిన అనేక మంది విద్యార్థులు మధ్యాహ్నం ఆకలికి తట్టుకోలేక ఇళ్లకు వెళ్తున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ఆల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలకు ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో ప్రధానంగా డ్రాపౌట్లు తగ్గిపోయి హాజరు శాతం పెంచేందుకు దోహదపడుతుంది. దీంతో పాటు ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం కూడా పెరగడానికి అవకాశం ఉంది.

- గతంలో ఇలా..

పడిపపోతున్న విద్యాప్రమాణాలను గుర్తించిన అధ్యాపకులు ఐదేళ్ల క్రితం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వార్షిక పరీక్షలకు ముందు రెండు నెలల పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం పాటు ఉత్తీర్ణత శాతం కూడా పెరిగింది. అప్పట్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చినా మరుసటి ఏడాది నుంచి ఎవరు ముందుకు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. దీంతో విద్యార్థుల్లో పామర్థ్యం తగ్గి ఉత్తీర్ణత శాతంపై ప్రభావం చూపింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ కళాశాలలు బలోపేతమవుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థులకు మేలు జరుగుతుంది.

చంద్రయ్య, ప్రిన్సిపాల్‌

ప్రభుత్వ కశాళాల్లో ప్రభుత్వం మధాహ్న భోజన పథకం అమలు చేయడంవల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. వివిద సరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉదయమే ఖాళీ కడుపులతో వస్తు మధ్యాహ్నం ఆకలితో ఇంటి బాట పడుతున్నారు. అనేక మంది విద్యార్థులు నిరసంగా ఉంటున్నారు. మధ్యాహ్న భోజనం అమలైతే విద్యార్థుల హాజరుశాతం పెరిగి మెరుగైన ఫలితాలు వస్తాయి.

Updated Date - Mar 23 , 2026 | 11:16 PM