ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు.
పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులతో ఫ్రెండ్లీగా ఉంటామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. రౌడీషీటర్లు తదితర నేరస్తుల విషయంలో కఠినంగానే ఉంటామని హెచ్చరించారు.
నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ప్రమావదశాత్తూ గోదావరి నదిలో గల్లంతయ్యారు.
జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రఽదాన పట్టణాల్లో గల్ల్లీగల్లీకి పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అర్హత లేని వారు సైతం పాఠశాలలు నెలకొల్పుతూ అందినకాడికి దండుకుంటున్నారు.
మండలంలో ప్రతి సంవత్సరం సుమారు 300 నుంచి 400 మంది విద్యార్థులు పదో తరగతిని పూర్తి చేస్తున్నారు. వీరు ఇంటర్ చదవాలంటే మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో బెల్లంపల్లి పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది.
డివిజన్లలో ప్రత్యేక సభలను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారిస్తున్నమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి.
మృగశిర ప్రవేశంతో వానాకాలం పంట సీజన పనులు జోరందుకున్నాయి. రైతులు విత్తనాల సేకరణ, ఎరువుల కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు. నకిలీలు రాజ్యమేలుతున్న ప్రస్తుతకాలంలో విత్తన ఎంపిక, ఎరువుల కొనుగోలులో రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
లాడ్జీల్లో బసచేసే వారి పూర్తి వివరాలను నమోదు చేయాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు.
నిజామాబాద్-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌హెచ్-63 విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రహదారి విస్తరణ పనులకు నిధుల విడుదలకు ను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పనులు పట్టాలెక్కనున్నాయి.