Share News

కొనసాగుతున్న ఆర్టిజన్‌ కార్మికుల సమ్మె

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:21 AM

విద్యుత్‌ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌శాఖ సర్కిల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు చేపడుతున్న సమ్మె దీక్షలు శనివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి.

కొనసాగుతున్న ఆర్టిజన్‌ కార్మికుల సమ్మె
దీక్షల్లో కూర్చున్న ఆర్టిజన్‌ కార్మికులు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి):విద్యుత్‌ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌శాఖ సర్కిల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు చేపడుతున్న సమ్మె దీక్షలు శనివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా జేఏసీ ఛైర్మన్‌ అత్రం మారుతి, కన్వీనర్‌ షేక్‌ నసీరుద్దీన్‌ మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్‌ కార్మికులకు స్టాండింగ్‌ ఆర్డర్‌ను రద్దు చేసి ఒకే సంస్థ, ఒకే సర్వీసు రూల్స్‌ అమలు చే యాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు మహబుబ్‌పాషా, శ్రీకాంత్‌, అశోక్‌, శీరిష, వామన్‌, శ్రీకాంత్‌, ఏకాంబరం పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 12:21 AM