Share News

రోడ్డు భద్రత నియమాలు పాటించండి

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:47 PM

వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. సోమవారం మండలంలోని బూర్గుడలో అరైవ్‌-అలైవ్‌ రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ నితికా పంత్‌

ఎస్పీ నితికా పంత్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. సోమవారం మండలంలోని బూర్గుడలో అరైవ్‌-అలైవ్‌ రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారుల తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలని, వేగపరిమితిని పాటించాలని సూచిం చారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వాహనాలు పడపాలని, కుటుం బాల భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రత పాటిస్తామని ప్రజలు, పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేశారు. పోలీసులు రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిలో భాగంగా సోమవారం ఆసిఫాబాద్‌ పట్టణంలో టీజీఎస్‌ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అరైవ్‌-అలైవ్‌ పేరుతో అవకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ రాజశేఖర్‌ మాటా ్లడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్ర యాణికుల భద్రతకు అత్యంత ప్రాధానం ఇస్తున్నామని తెలిపా రు. అసిస్టెంట్‌ మేనేజన్‌ దేవపాల, ఉద్యోగులు పాల్గొన్నారు.

వాంకిడి: మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అధికారులు సోమవారం అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌ నియమాలను పాటించాలని, హెల్మెట్‌ ధరించాలని, సీట్‌ బెల్టు ఉపయోగించా లని, మద్యం సేవవించి వాహనం నడపకూడదని నిదానాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీవో ఖాజా అజీజోద్దీన్‌, సర్పంచ్‌ సతీష్‌, ఎంబీఐ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌: రోడ్డు భద్రత ప్రతీ పౌరుడి బాధ్యత అని, రోడ్డు భద్రత నియమాలను ప్రతీఒక్కరు పాటించి పోలీసు యంత్రాం గానికి సహకరించాలని జైనూర్‌ సర్పంచ్‌ కొడప ప్రకాష్‌ కోరారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం రోడ్డు భద్రతపై గ్రామసభను సర్పంచ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఆదే విధంగా పవర్‌గూడ, రాసిమెట్ట, పానాపటార్‌, పాట్నాపూర్‌, అంద్‌గూడ, అడ్డెసర్‌, భుసిమెట్ట, జామ్ని, పొలాస, జంగాం, ఉసేగాం, పార, పోచంలొద్ది, తదితర గ్రామాల్లో రోడ్డు భద్రత గ్రామసభలు ముగిశాయి. కార్యక్రమంలో సర్పంచులు తొడ్సం రా జేందర్‌, మడావి భీంరావ్‌, పెందుర్‌ అర్జున్‌, ఆత్రం తులసీ, కందారె లక్ష్మీ, జాదవ్‌ జనాబాయి ఉన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 11:47 PM