సంపూర్ణత అభియాన్ 2.0 లక్ష్యాలను సాధించాలి
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:42 PM
నీతి ఆయో గ్ కార్యక్రమాల్లో భాగంగా సంపూర్ణత అభియాన్ లక్ష్యానికి అనుగుణంగా లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రబారి రజత్ సైని సూచించారు.
- నీతి అయోగ్ కేంద్ర ప్రభారి రజత్ సైని
ఆసిఫాబాద్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): నీతి ఆయో గ్ కార్యక్రమాల్లో భాగంగా సంపూర్ణత అభియాన్ లక్ష్యానికి అనుగుణంగా లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రబారి రజత్ సైని సూచించారు. సోమవారం సమీకృ త కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో జిల్లాలోని నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా సంపూర్ణత అభియాన్ 2.0లో అమలువుతున్న పనుల లక్ష్యాల సాధనపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి కేంద్ర ప్రభారి రజత్ సైని పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలల లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలన్నా రు. తిర్యాణి బ్లాక్, జిల్లా బ్లాక్‌ల కోసం ప్రణాళిక రూ పొందించాలన్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించే మార్పులు తీసుకు రా వాలన్నారు. జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి సరైన చికిత్సలు అందించాలన్నారు. గ్రామాల్లో ఆరోగ్యం, పారిశుధ్యం, పోషణ దినోత్సవ కార్యక్రమా లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ కేం ద్రాల్లో తాగునీరు, టాయిలెట్ నిర్మాణాలను 100 శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పశువులకు టీకాలు అందించే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. పాఠశాలలో బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణా లు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం వినియో గంలోకి తీసుకు రావాలన్నారు. నీతి ఆయోగ్ కార్యక్ర మంలో భాగంగా తిర్యాణి బ్లాక్, జిల్లా బ్లాక్‌లలో మౌలిక వసతుల కల్పనలో అధికారులు సమష్టిగా పనిచేసి బ్లాక్, జిల్లా లక్ష్యాల సాధనకు కృషి చేయాల ని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో సంపూర్ణత అభియాన్‌లో భాగంగా కలెక్టర్ హరిత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుబోద్‌కుమార్, జీజేహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి అంబులెన్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, జిల్లా సమన్వయకర్త బాలరాజు పాల్గొన్నారు.
రెబ్బెన: సంపూర్ణత అభియాన్ 2.0లో భాగంగా ఆకాంక్షిత జిల్లా అయినటువంటి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను నీతి ఆయోగ్ కేంద్ర ప్రబారి రజత్ సైని, కలెక్టర్ కె హరితతో కలిసి రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్‌వాడీ సెంటర్-1ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పనిచేస్తున్న విధానం, అంగన్‌వాడీలు, హెల్త్ అండ్ న్యూట్రిషన్ డే ను కూలంకుశంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన పిల్లలకు కలెక్టర్ హరిత అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం నిర్మితమవుతున్న మరుగుదొడ్లను పరిశీలించి కాంట్రాక్టర్లకు సరైన సమయంలో వాడుకలోకి తేవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సీతారాం, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణిలో పర్యటన
తిర్యాణి: తిర్యాణి మండలంలో కలెక్టర్ కె హరిత నీతి ఆయోగ్ ప్రత్యేకాధికారి రంజిత్‌కుమార్‌తో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ కార్యక్రమాల అమలులో భాగంగా మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. అంగన్‌వాడీ టీచర్‌తో మాట్లాడి పిల్లల హాజరు, పౌష్టిక ఆహారం పంపిణీ, రికార్డుల నిర్వహణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. నీతి ఆయోగ్ నిధులతో చేపట్టిన పనుల పురోగతి, నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. అధికారులకు పనులు సకాలంలో పూర్తిచేయాలని, నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పని తీరుపై నీతి ఆయోగ్ ప్రత్యేకాధికారి రంజిత్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీ సందర్భంగా ఔట్ పేషంట్, ఇన్ పేషంట్ల రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సిబ్బంది వివరాలు, వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు డెలవరీలు గ్రామాల్లో జరుగుతున్నాయా లేక ఆసుపత్రిలో జరుగుతున్నాయా అని ప్రత్యేకాధికారి ప్రశ్నించగా అన్ని డెలవరీలు ఆసుపత్రిలోనే జరుగుతున్నాయని డాక్టర్లు సమాధానం ఇచ్చారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన రంజిత్‌కుమార్ సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహిస్తున్న డాక్టర్ల బృందాన్ని అభినందించారు. పనితీరు బాగుందని.. ఇదే స్పూర్తిని కొనసాగించాలని సూచించారు. వారి వెంట డీఎంహెచ్‌వో సీతారాం, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేష్, డాక్టర్ కృష్ణ, అజయ్, పల్లవి తదితరులు ఉన్నారు.