గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:45 PM
గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సోమవారం సిర్పూర్(టి) మండలం మేట్‌పల్లి గ్రామంలో దక్షిణ గోండ్వానా గోండు రోజు మొకాసి స్మారక జెండా పూజ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి పాల్గొన్నారు.
- ఎమ్మెల్యే పాల్వారు హరీష్‌బాబు
సిర్పూర్(టి), ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సోమవారం సిర్పూర్(టి) మండలం మేట్‌పల్లి గ్రామంలో దక్షిణ గోండ్వానా గోండు రోజు మొకాసి స్మారక జెండా పూజ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసి రాయ్ దర్బార్‌లో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గిరిజన గ్రామాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరయ్యేలా సంబంధిత శాఖల మంత్రులకు నివేదికలు సమర్పిస్తామన్నారు. మేట్‌పల్లి గ్రామంలో సెల్ టవర్, మౌలిక వసతులు ఎంతో అవసరం ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 154 ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. అటవీ అధికారులు రిజర్వు ఫారెస్టు అని చెప్పి అడ్డుకున్నారన్నారు. తాను గిరిజనుల కోసం పోరాటం చేసి 40 రోజుల పాటు జైలు పాలయ్యాయని అన్నారు. గ్రామానికి మినీ ఆర్టీసీ బస్సు వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. అంతకు ముందు గిరిజనులు వారికి ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గిరిజన దర్బార్‌లో పాల్గొని వారి సంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని దర్బార్‌కు వచ్చిన ప్రజలకు అంబలి పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రహీముద్దీన్, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో వినోద్, సర్పంచ్ భీంరావు, గిరిజన నాయకులు సిడాం అర్జు, మాజీ సర్పంచ్ బ్రహ్మయ్య, సుర్పం అర్జు, మారు, మాంతయ్య, లావణ్య, సర్పంచ్ నాగమణి, నాయకులు ప్రశాంత్ తదితరులు పాాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వహిదోద్దీన్ ఆధ్వర్యంలో సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై సాగర్ బందో బస్తు నిర్వహించారు.