Share News

బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:19 AM

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే అని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో పాల్గొని ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.

బడుగు, బలహీనవర్గాల  ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే
ఆసిఫాబాద్‌లో జ్యోతిబాపూలే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

- ఘనంగా జయంతి వేడుకలు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే అని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో పాల్గొని ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భం గా అయన మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం మహిళల విద్యాభ్యాసం కోసం జ్యోతిబా ఫూలే విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. సంఘ సంస్కర్త, తత్త్వవేత్త, విద్యావేత్తగా అనేక కార్యక్రమాలను చేపట్టార ని అయన చూపిన బాటను అనుసరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మహనీయుల ఆశయ సిద్ధాంతాలను అచరించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అనిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మంగ, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, ఆసిఫాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, కౌన్సిలర్లు అబ్దుల్లా, స్వప్నరాణి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఆలీబీన్‌ ఆహ్మద్‌, అయా సంఘాల నాయకులు శంకర్‌, కేశవరావు, డాక్టర్‌ రమేష్‌, రవిందర్‌, ప్రణయ్‌ తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి: మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన జయంతి వేడుకల్లో జ్యోతిబాఫూలే విగ్రహాలకు, చిత్రపటాలకు మాలీ సంక్షేమ సంఘం, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు ఫూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ మహోల్‌కార్‌, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు జైరాం ఉప్రె, దుర్గం దుర్గాజీ, విజయ్‌, రాజేశ్వర్‌, సందీప్‌, ప్రతాప్‌, దుర్గం ప్రశాంత్‌, విలాస్‌, మాలీ సంఘం నాయకులు బోయిరే ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు: బెజ్జూరు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో మాలి సంఘం నాయకులు కొట్రంగి రామకృష్ణ, బీమన్న, నందయ్య, గోపాల్‌, సెండె శంకర్‌, మాండూరి శంకర్‌, సురేష్‌, మోహన్‌, తిరుపతి, రాజు నాయకులు తిరుపతి, జావీద్‌అలీ, సతీష్‌ తదితరులు ఉన్నారు.

జైనూర్‌: మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో జైనూర్‌ సర్పంచ్‌ కొడప ప్రకాష్‌, దళిత రత్న అవార్డు గ్రహిత మోహలె దత్త, మాలి సంఘం అధ్యక్షుడు హుస్సెన్‌ పెట్కులె, జంగ్టె రాందాస్‌, జంగ్టె రాజకుమార్‌, లెండగూరె సంజీవ్‌, చౌదరి జైరాం, గేడాం ఈశ్వర్‌, వాడ్గురె గవర్ధన్‌ హరి, అంబేద్కర్‌ సంఘం నాయకులు గాయక్‌వాడ్‌ సతీష్‌, భుతాలె కిరణ్‌, కాంబ్లే అన్నారావ్‌ తదితరులు ఉన్నారు.

కెరమెరి: మండలంలోని గోయగాంలో జరిగిన వేడుకల్లో గ్రామ పటేల్‌ శంకర్‌ మాట్లాడుతూ మాలీలు ఐక్యంగా ఉంటూ తమ హక్కుల సాధనకు నడుం బి గించాలని పిలుపునిచ్చారు. కెరమెరిలో జరిగిన వేడుక ల్లో సర్పంచ్‌ ఆత్రం ఆనంద్‌రావ్‌, ఉపసర్పంచ్‌ రాందాస్‌, గ్రామస్తులు పోసెట్టి, హెమాజీ, సోనాజీ మహారాజ్‌, ప్రభాకర్‌, బుచ్చన్న పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: మండలంలోని సీఆర్‌ నగర్‌లో ఫూలే విగ్రహానికి ఎమ్మెల్సీ దండె విఠల్‌ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మాలి సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు లెండుగురె శ్యాం రావు, నాయకులు విజయ్‌కుమార్‌, నాందేవ్‌, పోశెట్టి, తిరుపతి, కిషన్‌, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌ మండలంలోని కోసిని గ్రామంలో నిర్వ హించిన వేడుకల్లో పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏటుకూరి శ్రీనివాస్‌ రావు, సునార్కర్‌ అనిల్‌ కుమార్‌, గౌరవ అధ్యక్షుడు నరసింహచారి, ఉపాఽధ్యాయులు బిక్షపతి, దేవాజి, శశికాంత్‌, రమేష్‌, ప్రకాష్‌, కిరణ్‌, రాంచెందర్‌ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. నాయకులు కొంగ సత్యనారాయణ, సర్పంచ్‌లు వసాకె పుల్లాబాయ్‌, రాజేందర్‌, పర్వతి అంజన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 12:19 AM