తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యా యులు సమష్టిగా కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య, ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు.
సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వ్యవసాయ అధికారుల సూచనలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందిచే పంటను వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు కేమ పొచ్చన్న. వడ్డాడికి చెందిన రైతు తనకున్న మూడెకరాల భూమిలో ఎకరంలో బంతిపూల పంటను సాగు చేసేం దుకు ముందుకొచ్చారు.
వానాకాలం సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. సీసీఐ ద్వారా జిల్లాలో ఈ సీజన్లో మొత్తం 11 సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
గ్రామపంచాయతీ కార్మి కుల సమస్యలను పరిష్కరించి సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మి కులు బుధవారం ధర్నా నిర్వహించారు.
ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు పేర్కొన్నారు.
జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్యకళాశాల భవన నిర్మాణ పనులు మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
మహిళలను అన్నిరంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆర్థికంగా చేయూతనందించేందుకు మహిళా సంఘాల మాదిరిగా కిశోర బాలికలకు పొదుపు సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
కెరమెరి అటవీ రేంజ్ పరిధిలో ఆదివాసు లకు, బడుగు, బలహీనవర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదివా సీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.
మూడు నెలలు నుంచి వేతనాలు రాక అనేక ఇబ్బం దులు పడుతున్నామని వెం టనే వేతనాలు విడుదల చే యాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు ఎం పీడీవో కార్యాలయంలో మం గళవారం వినతిపత్రం అంద జేశారు.