ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:41 PM
ప్రజలంద రు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాగజ్‌నగర్ పట్టణంలో శనివారం ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
- ఎస్పీ నితికా పంత్
కాగజ్‌నగర్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజలంద రు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాగజ్‌నగర్ పట్టణంలో శనివారం ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలపరిచే లక్ష్యంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా జరగడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రజల్లో నమ్మకం పెంపొందించడం, శాంతిభ ద్రత పరిస్థితులను పర్యవేక్షించడం, ఎన్నికల సమయం లో అసాంఘిక, అవాంఛనీయ చర్యలను అరికట్టడం ఫ్లాగ్‌మార్చ్ ఉద్దేశమని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదన్నారు. డబ్బు, మద్యం, బహు మతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మూడు ప్రధాన చెక్ పోస్టుల ను ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వాహిదుద్దీన్, సీఐలు ప్రేంకుమార్, కుమార స్వామి, ఎస్‌ఐలు సందీప్, కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
కల్వాడలో పోలీసుల కవాతు
దహెగాం (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలం కల్వాడ గ్రామంలో శనివారం కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు విక్రమ్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.