అంబేద్కర్ ఆశయాలను ప్రతీ ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:48 PM
ఆసిఫాబాద్ పట్టణంలో శనివారం అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
- జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ పట్టణంలో శనివారం అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు అలీబీన్ అహ్మద్, సరస్వతీ, అహ్మద్, భీమేష్, శ్రీను, వెంకన్న, నిసార్, నారాయణ, జీవన్, వామన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి అంబేద్కర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చైర్మన్ రూప్‌నార్ రమేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ప్రణయ్, మారుతి, నారాయణ, పురుషోత్తం, బాలేష్, లహుకుమార్, ప్రశాంత్, సాయికృష్ణ, రవికాంత్, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి నేతకాని సంఘం నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో నాయకుల రాజయ్య, రమేష్, భూమయ్య, పవన్, తిరుపతి, రాజు, బాపు, అశోక్‌గౌడ్, శోహన్, మోహన్, ధర్మం, అమర్ తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఖమన, కనర్‌గాం, వాంకిడి, బెండార, ఇంధాని, ఖిరిడి, తదితర గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు ఫూమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షుడు ఉప్రె జయరామ్, బిఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు మహోల్‌కార్ అశోక్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దుర్గం దుర్గాజీ, దుర్గం శ్యాంరావు, ఉప్రె విజయ్, హంసరాజ్, రాజేశ్వర్, సందీప్, రోషన్, విలాస్, టేమాజీ, మారుతి, దుర్గం దినకర్, శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ, దీపక్ ముడె, పెంటు, రమాబాయి పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో గల అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమలో మాజీ ఎంపీపీ ఆత్రం దౌలత్‌రావు, అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంబ్లె బావ్‌రావు, కాంగ్రుస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్, నాయకులు పెందోర్ రాము, ఆత్రం దిన్‌కర్‌షా, కుమ్ర దేవిదాస్, ఆత్రం లచ్చు తదితరులు పాల్గొన్నారు.