Share News

ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించాలి

ABN , Publish Date - Dec 08 , 2025 | 10:52 PM

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలంద రూ ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ నితికా పంత్‌ సూచించారు.

ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించాలి
ఆసిఫాబాద్‌ పట్టణంలో కవాతు నిర్వహిస్తున్న ఎస్పీ నితికా పంత్‌, పోలీసులు

- ఎస్పీ నితికా పంత్‌

- పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్‌మార్చ్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలంద రూ ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ నితికా పంత్‌ సూచించారు. ఆసిఫాబాద్‌ పట్టణంలో ఎస్పీ నితికా పంత్‌ ఆధ్వ ర్యంలో పోలీసులు సోమవారం ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ప్రజలందరు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించా లని, ఎవరైనా గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడడం, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘించడం లాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ప్రజలు ఎన్నికల నియమాలను పాటించాలని, డబ్బులు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏఎస్పీ చిత్తరంజన్‌, సీఐ బాలాజీ వరప్రసాద్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

- ఆసిఫాబాద్‌ మండలం బాబాపూర్‌లో సోమ వారం పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ బాలాజీ వరప్రసాద్‌ మాట్లాడు తూ ప్రజల శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసు లు ముందుంటారన్నారు. అభ్యర్థులు ఎన్నికల నియ మావళికి లోబడి నడుచుకోవాలని సూచించారు.

వాహనాల తనిఖీ

పెంచికలపేట: పంచాయతీ ఎన్నికల నేపథ్యం లో ఎస్సై అనిల్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ చిన్ను ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వాహనాల తనిఖీని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భం గా వాహనదారుల ధ్రువపత్రాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, మత్తు పదార్థాలు, బెట్టింగ్‌ కార్యకలాపాలు వంటి నేరాలను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. వాహనదారులు సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 10:52 PM