Share News

పంచాయతీ ఎన్నికలో స్వేచ్ఛగా పాల్గొనాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:45 PM

అధైర్యపడకుండా స్వేచ్చగా ఎన్నికల్లో పాల్గొనాలని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదుద్దీన్‌ అన్నారు. చింతలమానేపల్లి మండలం రన్‌వెల్లి గ్రామంలో దళం పేరుతో బెదిరింపు ఘటనలో ఆయన విచారణ జరిపారు.

 పంచాయతీ ఎన్నికలో స్వేచ్ఛగా పాల్గొనాలి
రన్‌వెల్లి గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ వహిదుద్దీన్‌

- డీఎస్పీ వహిదుద్దీన్‌

- దళం పేరుతో బెదిరింపు ఘటనపై విచారణ

కౌటాల(చింతలమానేపల్లి), డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): అధైర్యపడకుండా స్వేచ్చగా ఎన్నికల్లో పాల్గొనాలని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదుద్దీన్‌ అన్నారు. చింతలమానేపల్లి మండలం రన్‌వెల్లి గ్రామంలో దళం పేరుతో బెదిరింపు ఘటనలో ఆయన విచారణ జరిపారు. సర్పంచ్‌ అభ్యర్థి దర్శన మామ బాపు ను దళం పేరుతో తుపాకీ గురిపెట్టి లేఖ ఇచ్చిన సందర్భంగా విచారణను ముమ్మరం చేశారు. బాపును పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నింది తుడి ఆనవాళ్లు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనా లని తాము అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుం టామని భరోసా ఇచ్చారు. కౌటాల సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సైలు నరేష్‌ ఆ దారిలో వెళ్లే సీసీ కెమెరాలను పరిశీలించి గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ భరోసా ఇచ్చారు.

Updated Date - Dec 06 , 2025 | 11:45 PM