ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన కోసం నైజాంకు వ్యతిరేకంగా సమర భేరి మోగించిన యోధుడు.. నిజాం నిరంకుశ పాలనలో గిరిజనులకు జరుగుతున్న అన్యా యాలపై ఎలుగెత్తిన వీరుడు.. జల్.. జంగల్.. జమీన్( భూమి, నీరు, అడవి) హక్కుల కోసం చేసిన పోరాటంలో అమరుడై గిరిజనుల ఆరాధ్య దైవమయ్యాడు కుమరం భీం.
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండల కేంద్రంలోని గురుకులం ఎదుట కాగజ్నగర్-సిర్పూర్(టి) ప్రధాన రహదారిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు.
జిల్లా కేంద్రంలో గత శుక్రవారం శారద, దుర్గదేవిల శోభాయాత్రలో పోలీసులతీరును నిరసిస్తూ హిం దూ సంఘాల సభ్యులు సోమవారం ఇచ్చిన పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది.
కెరమెరి మండలం జోడేఘాట్లో మంగళవారం నిర్వహించనున్న కుమరం భీం వర్ధంతి ఏర్పాట్లు పూర్తి అ య్యాయి.
జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలను ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ధర్మపురి క్షేత్రంలో ఏటా నిర్వహించే విధంగా ఉత్సవాల సందర్భంగా సాయం త్రం వేళలో లక్ష్మీ నృసింహస్వామి, వేంకటేశ్వరస్వామి వారల ఉత్సవమూర్తులను సేవలపై ఆశీనులు చేశా రు.
రివైజ్డ్ పీపీవో(పెన్షన్ పేమెంట్ ఆర్డర్) పంపణీ నత్తనడకన సాగుతుండడంతో రివైజ్డ్ పెన్షన్లు అందుకునేందుకు ఎదురుచూస్తున్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల జీవితభాగస్వాములకు నిరాశ ఎదురవుతోంది.
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
ప్రతీ సంవత్సరం చేపట్టే చీరల పంపిణీ కార్యక్రమాన్ని నవంబరు నెలలో చేపడతామని డీసీసీ అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు.