మూడో విడత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:03 AM
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో విడత సర్పం చ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో విడత సర్పం చ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదా యంలోని వీసీ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి మూడో విడత ఎన్నికల నిర్వహ ణపై ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, స్టేజ్-2 ఆర్‌వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాదారణ పంచాయతీ ఎన్నికలు -2025లో భాగంగా మూడో విడతలో సర్పంచ, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి అవసర మైన ఎన్నికల సామగ్రి అందించాలని మొదటగా మారు మూల గ్రామపంచాయతీ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని తరలించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు సరిపడ ఉండేలా చర్యలు తీసుకోవా లని, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికా రులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మూడో విడతలో 104 గ్రామ పంచాయతీలు, 744 వార్డు సభ్యుల కు ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరిగేలా అధికా రులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ అనంతరం కౌంటింగ వేగవంతంగా జరిగేలా అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రత్యేక సంబంధించిన నివేదికలను నిర్ణిత నమునాలో టిపోల్‌లో నమోదు చేయాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో మూడో విడత ఎన్నికలు జరిగేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సామగ్రిని సమర్థవంతంగా పంపిణీ చేయాలి
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నేప థ్యంలో జిల్లాలో జరుగనున్న మూడో విడత ఎన్నికల కోసం ఎన్నికల సామగ్రి కేటా యించిన ప్రకారం సమర్థవంతంగా పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి సోమవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న అధికారులు, సిబ్బంది నిర్దేశిత సమయానికి తమకు కేటాయించిన ఎన్నికల సామగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మూడో విడతలో భాగంగా ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్, తిర్యాణి మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. సిబ్బంది ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట ఎన్నికల అధికారులు ఉన్నారు.