Maoist Leader: పోలీసుల అదుపులో మావోయిస్టు అధినేత?
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:10 PM
మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలిచింది. మావోయిస్టు అగ్రనేతతో పాటు 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఆదిలాబాద్, డిసెంబర్ 16: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా.. భారీ సంఖ్యలో మావోలు లొంగిపోయారు. ఇప్పుడు తాజాగా మావోయిస్టు కీలక నేత పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అధినేత చొక్కరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈరోజు (మంగళవారం) ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ )లో 15 మంది మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు ఉండగా 7 పురుషులు ఉన్నట్టు సమాచారం.
అలాగే వారిలో మావో అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారందనీ హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నారు. మావోయిస్టులు పట్టుబడటంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం తేదీలో మార్పు..
యూరియా కొనుగోళ్ల కోసం సరికొత్త యాప్: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And Telugu News