Minister Azharuddin: తెలంగాణలో వక్ఫ్ భూములపై దృష్టి పెట్టాం:మంత్రి అజారుద్దీన్
ABN , Publish Date - Dec 16 , 2025 | 01:58 PM
గురుకులాల్లో ఫుడ్ ఫాయిజన్ ఘటన దురదృష్టకరమని తెలంగాణ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం విచారణకు అదేశించిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వక్ఫ్ భూములపై దృష్టి పెట్టామని తెలంగాణ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ (Minister Azharuddin) వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా ఉమ్మిద్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని.. ఇందుకోసం కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఉమ్మిద్ పోర్టల్‌లో గత 10 రోజులుగా టెక్నికల్ ఎర్రర్ ఏర్పడిందని చెప్పుకొచ్చారు మంత్రి అజారుద్దీన్.
వక్ఫ్ భూముల ఎన్‌రోల్‌మెంట్‌కు కొంత సమయం పడుతుందని తెలిపారు. తప్పుడు పత్రాలతో భూములను అప్‌లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతాయని వివరించారు. ఇవాళ(మంగళవారం) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. మొత్తం 63,180 ఎకరాల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. వీటిలో 46 వేల ఎకరాల భూములు పోర్టల్‌లో నమోదు కాలేదని చెప్పుకొచ్చారు. 16,700 ఎకరాల భూములు పోర్టల్‌లో ఎక్కించారని వెల్లడించారు మంత్రి అజారుద్దీన్.
పోర్టల్‌లో భూముల వివరాలు నమోదు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని వివరించారు. గురుకులాల్లో ఫుడ్ ఫైయిజనింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో ఫుడ్ ఫాయిజన్ ఘటన దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం విచారణకు అదేశించిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు మంత్రి అజారుద్దీన్.
విద్యార్థులకు పెట్టె భోజనం 30 నిమిషాల ముందు అక్కడ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశించామని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వక్ఫ్ భూముల అంశంపై చర్చించామని తెలిపారు. భూముల పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు మంత్రి అజారుద్దీన్.
ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు లేఖలు రాశామని ప్రస్తావించారు. వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ కోసం యాప్ సరిగ్గా పనిచేయడం లేదని అన్నారు. రాబోయే బడ్జెట్‌లో మైనార్టీల కోసం కొంత బడ్జెట్‌ను పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాలలపై తప్పుడు కథనాలు సరికాదని చెప్పుకొచ్చారు. గురుకులాల్లో కేవలం 40 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నాయని మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని మోదీతో భేటీ విషయాలను లీక్ చేసిందెవరు.. కిషన్‌రెడ్డి ఫైర్
వార్డుల డీ లిమిటేషన్‌పై జీహెచ్ఎంసీ కౌన్సిల్ చర్చ
Read Latest Telangana News And Telugu News