Tummala Nageswara Rao: యూరియా కొనుగోళ్ల కోసం సరికొత్త యాప్: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Dec 16 , 2025 | 01:43 PM
యూరియాను బ్లాక్‌లో పరిశ్రమల అవసరాలకు తరలిస్తున్నారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయని మంత్రి తుమ్మల తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా నేరుగా రైతులకు అందే విధంగా మొబైల్ యాప్ పనిచేస్తుందని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 16: యూరియా కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ తీసుకొస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. రైతు వేదికల ద్వారా మొబైల్ యాప్‌పై రైతుల అభిప్రాయం సేకరించామన్నారు. మొబైల్ యాప్‌పై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. పత్తి అమ్మకం కోసం రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటున్నారని.. అది 100 శాతం సక్సెస్ అయిందన్నారు. రైతులకు స్లాట్ బుకింగ్ సహాయం కోసం రైతు వేదికల వద్ద ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
రాజకీయ పబ్బం కోసం కొంతమంది వ్యక్తులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. యూరియాను బ్లాక్‌లో పరిశ్రమల అవసరాలకు తరలిస్తున్నారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా నేరుగా రైతులకు అందే విధంగా మొబైల్ యాప్ పనిచేస్తుందని తెలిపారు. శాటిలైట్ ద్వారా పంటల సర్వేల కోసం జర్మనీ కంపెనీతో చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు.
ఆ అగ్రిమెంట్ కుదిరితే పంట వేసిన భూమికే రైతు భరోసా సహాయం ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. కొండలు, గుట్టలకు భరోసా నిలిపేసి ఆ నిధులను ఫసల్ భీమకి ఉపయోగిస్తే బాగుంటుందని.. త్వరలో వీటిపై కేబినెట్‌లో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం తేదీలో మార్పు..
Read Latest Telangana News And Telugu News