BRSLP Meeting: బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం తేదీలో మార్పు..
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:34 AM
ఈనెల 19న జరగాల్సిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం వాయిదా పడిందని మాజీమంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈనెల 21న బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్, డిసెంబర్ 16: మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని (BRSLP Meeting) వాయిదా వేశారు. ఈనెల 19న జరగాల్సిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశాన్ని ఈనెల 21కి వాయిదా వేసినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) ప్రకటించారు. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కోసం సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిపారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) అధ్యక్షతన ఈ నెల 21న తెలంగాణ భవన్ వేదికగా సమావేశం జరుగనుందని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు పాల్గొననున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
దారుణం.. కన్న బిడ్డను బిల్డింగ్ పై నుంచి పడేసిన తల్లి
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
Read Latest Telangana News And Telugu News