Share News

లోక్‌ అదాలత్‌ తీర్పే అంతిమం

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:25 PM

లోక్‌అదాలత్‌ తీర్పు అంతిమమని జిల్లా అదనపు న్యా యమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ లాల్‌సింగ్‌ శ్రీనివాసనాయక్‌ అన్నారు.

లోక్‌ అదాలత్‌ తీర్పే అంతిమం
మంచిర్యాలలో మాట్లాడుతున్న జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాసనాయక్‌

జిల్లా అదనపు న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ లాల్‌సింగ్‌ శ్రీనివాసనాయక్‌

మంచిర్యాల, క్రైం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యో తి): లోక్‌అదాలత్‌ తీర్పు అంతిమమని జిల్లా అదనపు న్యా యమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ లాల్‌సింగ్‌ శ్రీనివాసనాయక్‌ అన్నారు. మంచిర్యా ల జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో సుమారు 3,800 కేసులు పరిష్కరించామని తెలిపారు. ఆదివారం మంచిర్యాలలోని కోర్టులో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో ఆయన మాట్లా డారు. మొత్తం తొమ్మిది లోక్‌ అదాలత్‌ బెంచ్‌లను ఏర్పా టుచేసి కేసులను పరిష్కరించా మన్నా రు. ఇందులో సివిల్‌ దావాలు 15, వాహన పరిహారం కేసులు ఐదు, క్రిమినల్‌ కేసులు 3,650, ఇతర కేసులు, సైబర్‌ క్రైమ్‌లు 33, బ్యాంక్‌ ప్రిలిటిగేషన్‌ కేసులు 75, ఇతర కేసులు మొత్తం కలిపి సుమారు 3,800 కేసులు పరిష్కరిం చామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవసంస్థ కార్యదర్శి నిర్మల, సివిల్‌ జడ్జి రామ మోహన్‌రెడ్డి, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు కవిత నిరోష, కృష్ణతేజ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌, పోలీసు లు పాల్గొన్నారు.

రాజీ మార్గమే రాజమార్గం

లక్షెట్టిపేట (ఆంధ్రజ్యోతి): రాజీ మార్గమే రాజమా ర్గం అని లక్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌ కాసమల కక్షిదారులకు సూచించారు. ఆదివారం పట్టణ న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో జడ్జ్‌ ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడా రు. ఈసందర్భంగా జడ్జ్‌ మాట్లాడుతూ సమయం చాలా విలువైదని గడిచిన సమయం తిరిగి పొందలేమన్నారు. కక్షిదారులు కోర్టుల చుట్టు తిరుగుతూ చిన్నచిన్న తగాదా లతో ఆవేశంలో కేసులు పెట్టుకుని సమయం వృథా చేసుకోకూడదనే న్యాయ సేవాధికార సంస్థ ఈఅవకాశం కల్పించిందని తెలిపారు. కక్షిదారులు ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసుల్లో రాజీ కుదుర్చుకుని వాటిని పరిష్క రించుకునేందుకు చక్కటి అవకాశం అని అన్నారు. లోక్‌ అదాలత్‌ తీర్పు అంతిమ తీర్పు అని ఇందులో తీర్పు ఇచ్చిన తర్వాత అది అప్పీల్‌ చేసుకునేం దుకు కూడా వీలు ఉండదన్నారు. కక్షిదారులు లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను పరిష్క రించుకుని చక్కగా ఎవరి పనులు వారు చేసుకోవాలని సూచించారు. రాజీ కుదుర్చుకున్న కేసులను పరిష్కరించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షు డు గాండ్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం, హాజీపూర్‌ ఎస్సైలు గోపతి సురేష్‌, తహసీయోద్దీన్‌, అనూష, స్వరూప్‌రాజ్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 11:25 PM