Home » Navya » Health Tips
మెంతి గింజలు మన భారతీయ వంటకాల్లో ముఖ్యంగా వాడుతుంటాం. కూరల నుంచి ఊరగాయల వరకూ ఏదో విధంగా మెంతులు ఉంటూనే ఉంటాయి. మెంతులు, మెంతుకూరలో చాలా పోషకాలున్నాయి. పరగడుపునే మెంతి నీరు తాగినట్లయితే మధుమేహం ఉన్నవారికి గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది. మెంతులు, సోపు గింజలు, పసుపు, దాల్చిన చెక్కతో చేసే ఈ పానీయం ఆరోగ్యపరంగా మంచి శక్తిని ఇస్తుంది.
రోజ్ షిప్‌లు, గులాబీ మొక్కలకు పూసే చిన్న కాయలు, వీటిలో అనేక శక్తివంతమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి.
ఆహారపు అలవాట్లు సరిగాలేకపోవడం, శారీరక శ్రమలేకపోవడం వల్ల కాలేయ వ్యాధి వస్తుంది. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ గోధుమ నూక జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇవి గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీరం సహజంగా మూత్ర విసర్జన చేయడం, చెమటలు పట్టడం, ఊపిరి పీల్చుకోవడం వంటి సాధారణ ప్రక్రియల ద్వారా ప్రతిరోజూ నీటిని కోల్పోతుంది.
విశ్రాంతి తీసుకునే సమయం, అవకాశం కలగకపోవడం కూడా మన మీద ఒత్తిడికి కారణం అనుతుందట. స్ట్రెస్ లాక్సింగ్ అంటే విశ్రాంతి తీసుకోవాలని ప్రయత్నించడంలో కూడా ఒత్తిడికి గురికావడం.
తల్లిపాలు ఇచ్చే సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ గర్భధారణ సమయంలో డెలివరీ సమయంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లలు పాల కోసం రొమ్మును పీల్చినపుడు ఆక్సిటోసిన్ హార్మోన్ రొమ్ము కణజాలం సంకోచించి, పాలు విడుదల అయ్యేలా చేస్తుంది.
గర్భధారణ సమయంలో దురద, దద్దుర్లు, ఎర్రటి పాచెస్ స్ట్రెచ్ మార్క్స్ చుట్టూ ఏర్పడతాయి. బొడ్డు సాగినప్పుడు డెలివరీ చివరిలో చేతులు, కాళ్ళలో ఈ దురదలు ఎక్కువగా ఉంటాయి.
ఐరన్ లోపం వల్ల శరీరంలో రక్త హీనత ఏర్పడుతుంది. అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. తల తిరగడం, ఏ పని మీదా ఏకాగ్రత లేకపోవడం, చికాకు, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు ఉంటాయి.
ఉపవాసం మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండి, ఆరోజు కేవలం నీటిని మాత్రమే తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.