Share News

ఆరోగ్యమే మహాభాగ్యం

ABN , Publish Date - Feb 17 , 2026 | 02:32 AM

కుటుంబంలోని అందరి ఆరోగ్యాన్ని పట్టించుకునే మహిళలు తమ ఆరోగ్యం విషయంలో మాత్రం వెనుకబడి ఉంటారు....

ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్య సూత్రాలు

కుటుంబంలోని అందరి ఆరోగ్యాన్ని పట్టించుకునే మహిళలు తమ ఆరోగ్యం విషయంలో మాత్రం వెనుకబడి ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇల్లు నిండుగా ఉండేది. కాబట్టి ఈ చిన్న సూత్రాలు మీ కోసం..

నీటి ప్రాముఖ్యత: చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా రోజూ కనీసం 3-4 లీటర్ల నీటిని తాగడం ముఖ్యం. నీటిలో కొన్ని పుదీనా ఆకులు లేదా నిమ్మచెక్కలు వేసుకుని ‘డిటాక్స్‌ వాటర్‌’లా తాగితే ఇంకా మంచిది.

ఐరన్‌ ముఖ్యం: మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువ. అందుకే రోజూ ఒక బెల్లం ముక్క లేదా ఖర్జూరం తినడం అలవాటు చేసుకోండి. ఆకు కూరలను వారానికి మూడుసార్లు ఆహారంలో భాగం చేసుకోండి.

నడక తప్పనిసరి: జిమ్‌కు వెళ్లే సమయం లేకపోతే రోజుకు కనీసం 30 నిమిషాల వేగవంతమైన నడక అలవాటు చేసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 02:32 AM