పిల్లల కోసం స్క్రీన్ ఫ్రీ యాక్టివిటీస్
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:10 AM
స్కూల్‌కు సెలవులు రాగానే పిల్లలు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం సహజం. అలా కాకుండా వారి సృజనాత్మకతను పెంచేలా...
స్కూల్‌కు సెలవులు రాగానే పిల్లలు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం సహజం. అలా కాకుండా వారి సృజనాత్మకతను పెంచేలా వేసవిని ఎలా ప్లాన్ చేయవచ్చో చూద్దాం.
కిచెన్ గార్డెనింగ్: పిల్లలకు మట్టితో ఆడుకోవడం అంటే ఇష్టం. చిన్నచిన్న కుండీల్లో టమాటా, పచ్చిమిర్చి వంటి మొక్కలు నాటించి వాటికి రోజూ నీళ్లు పోసే బాధ్యత వారికి అప్పగించండి. మొక్క పెరగడాన్ని వారు రోజూ గమనిస్తూ ఎంతో నేర్చుకుంటారు.
వంటలో సాయం: వేడి లేని వంటలు.. అంటే ఫ్రూట్ సలాడ్ చేయడం, నిమ్మరసం కలపడం, శాండ్‌విచ్‌లు సిద్ధం చేయడం వంటివి పిల్లలకు నేర్పండి. ఇది వారికి స్వయం సమృద్ధిని నేర్పుతుంది.
బోర్డ్ గేమ్స్, పజిల్స్: పాతకాలపు ఆటలైన అష్టాచెమ్మా, వామనగుంటలు, లేదంటే చెస్, మోనోపోలీ వంటి ఆటలు ఆడించడం వల్ల వారి ఆలోచనా శక్తి పెరుగుతుంది. వారితో కలిసి మీరు కూడా ఆడితే ఆ బంధం మరింత బలపడుతుంది.
రీడింగ్ చాలెంజ్: ఈ వేసవిలో కనీసం 5-10 పుస్తకాలు చదవాలనే లక్ష్యాన్ని వారికి ఇవ్వండి. చదివిన తర్వాత ఆ కథలోని సారాన్ని అందరికీ చెప్పమని ప్రోత్సహించండి. ఇది వారి భాషా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..