పొద్దున్నే తినకపోతే..
ABN , Publish Date - Feb 17 , 2026 | 02:24 AM
ఉదయం అల్పాహారం తినకుండా ఉండడం ద్వారా కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటంటే... ఉదయానికే మన శరీరం 8 నుంచి 10 గంటల ఉపవాసంలో...
మీకు తెలుసా?
ఉదయం అల్పాహారం తినకుండా ఉండడం ద్వారా కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
అవేంటంటే...
ఉదయానికే మన శరీరం 8 నుంచి 10 గంటల ఉపవాసంలో ఉంటుంది. ఇన్సులిన్ తక్కువగా ఉంటుంది. నిల్వ శక్తి అందుబాటులో ఉంటుంది. మరమ్మత్తు వ్యవస్థలు చురుగ్గా ఉంటాయి. కాబట్టి ఆహారం తిన్న వెంటనే ఇవన్నీ మూతపడిపోతాయి. అల్పాహారాన్ని మానుకోవడం వల్ల ఇన్సులిస్ అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ తక్కువగా ఉంటే శరీరం తనలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించుకుంటుంది. కాబట్టి తిన్న ఆహారాన్ని ఖర్చు చేసుకోడానికి బదులుగా, అప్పటికే నిల్వ ఉన్న కొవ్వును కరిగించుకోవడం ఉత్తమం. ఉదయం ఉపవాసంతో ఫ్యాట్ ఆక్సిడేషన్ పెరుగుతుంది. గ్లూకోజ్ డిపెండెన్స్ తగ్గుతుంది. శక్తి స్థిరంగా ఉంటుంది. ఆహారం అందనప్పుడు కాలేయం కీటోన్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. కీటోన్స్, మెదడుకు సమర్థమైన, శుభ్రమైన ఇంధనం లాంటివి. ఫలితంగా మెదడు చురుకుదనం పెరుగుతుంది. ఆలోచనాశక్తి మెరుగు పడుతుంది. ఆహార కొరత వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. ఉపవాస సమయంలో శరీరం ఆటొఫజీని ప్రేరేపిస్తుంది. ఇదొక కణశుద్ధి వ్యవస్థ. పాత ప్రొటీన్లు, కణవ్యర్థాలు రీసైకిల్ అవుతాయి. ఆటోఫజీతో కణ సామర్థ్యం పెరుగుతతుంది. కణజాలం నాణ్యత మెరుగుపడుతుంది. ఉపవాసంతో గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. కణజాల మరమ్మత్తు సాధ్యపడుతుంది. అయితే ఈ ప్రయోజనాలను పొందడం కోసం కడుపు మాడ్చుకోకూడదు, తక్కువ ఆహారం తినకూడదు, ప్రొటీన్‌ను మానకూడదు. రోజులో తినే మొదటి భోజనాన్ని కాస్త ఆలస్యంగా తినాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News