ఈ ఉప్పులు నిరర్థకం
ABN , Publish Date - Feb 17 , 2026 | 02:35 AM
హైపోథైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు ప్రత్యేకించి కొన్ని సాల్ట్స్‌ను ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తూ ఉంటారు. కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నం....
తెలుసుకుందాం
హైపోథైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు ప్రత్యేకించి కొన్ని సాల్ట్స్‌ను ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తూ ఉంటారు. కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నం.
అత్యధిక టిఎ్‌సహెచ్, తక్కువ టి3, టి4 కలిగి ఉండే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్లు అందుబాటులో ఉన్న హిమాలయన్, రాక్, సెల్టిక్ ఇలా పలు రకాల సాల్ట్స్‌ను ఎంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ నిరుపయోగకరం. ఎందుకంటే....
హిమాలయన్/పింక్ సాల్ట్: దీన్లో ట్రేస్ మినరల్స్ ఉంటాయి. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం తక్కువ మోతాదుల్లో ఉంటాయి. కానీ దీన్లో అయోడిన్ ఉండదు. కాబట్టి ఈ ఉప్పుతో ప్రయోజనం శూన్యం
రాక్ సాల్ట్/సైంధవ లవణం: ఉపవాస సమయాల్లో ఎలకొ్ట్రలైట్ బ్యాలెన్స్ కోసం ప్రధానంగా ఉపయోగించేవారు. దీన్లో అయొడిన్ ఉండదు కాబట్టి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడదు
సెల్టిక్ సాల్ట్: దీన్లో ఖనిజ లవణాలు ఎక్కువ. కాబట్టి హైడ్రేషన్‌కు తోడ్పడుతుంది. కానీ దీన్లో కూడా అయొడిన్ ఉండదు. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడదు
బ్లాక్ సాల్ట్/కాలా నమక్: జీర్ణశక్తిని పెంచుతుంది. భోజనానంతర కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. దీన్లో కూడా అయొడిన్ ఉండదు. కాబట్టి థైరాయిడ్ గ్రంథికి ఉపయోగపడదు
అయొడైజ్డ్ సాల్ట్
టి3, టి4 హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడేలా రూపొందిన ఉప్పు ఇది. గోయిటర్, హైపోథైరాయిడిజంలను నివారిస్తుంది. ప్రత్యేకించి గర్భిణులకు ప్రయోజనకరం. గర్భంలో పెరిగే బిడ్డ మెదడు ఎదుగుదలకు తోడ్పడుతుంది. మన థైరాయిడ్ గ్రంథి అందంగా కనిపించే ఉప్పులతో ప్రయోజనం పొందదు. దానికి అయొడిన్ అవసరం. కాబట్టి 80 నుంచి 90ు అయొడిన్ కలిగిన ఉప్పుతో పాటు అదనపు పోషకాల కోసం 10 నుంచి 20ు ఇతర ఉప్పులను కలిపి వాడుకోవడం మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News